Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీ మామ మీద పాతిక కోట్ల రిస్క్

వెంకీ మామ మీద పాతిక కోట్ల రిస్క్

పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న పెద్ద బడ్జెట్ సినిమా వెంకీమామ. హీరోలు వెంకటేష్, నాగచైతన్య, ఇంకా భారీ స్టార్ కాస్ట్ కారణంగా, సినిమా విడుదల ఖర్చులు, పబ్లిసిటీ, వడ్డీలు అన్నీకలిసి 48 కోట్ల వరకు ఖర్చు అయినట్లు బోగట్టా. ఇప్పుడు ఈ సినిమాకు సరైన డేట్ ప్రకటించడంలో కిందామీదా అవుతున్నారు. మరోపక్క ఈ సినిమాను ఆంధ్ర ఏరియాకు 18 కోట్ల రేంజ్ లో రేటు చెబుతున్నారు.

డేట్ తెలియడం లేదు. రేటు అదురుతోంది. దాంతో బయ్యర్లు ముందుకు రావడంలేదు. డేట్ తెలిస్తే, ఎంతోకొంత కోట్ చేసే అవకాశం వుంది. కానీ దాన్ని కూడా నానుస్తున్నారు. గతంలో సురేష్ పార్టనర్ షిప్ లో నిర్మించి ఎమ్ఎల్ఎ, ఓ బేబీ సినిమాలు కూడా అమ్మకుండా సురేష్ విడుదలే చేసారు. కానీ అవి విడుదలకు ముందే నాన్ థియేటర్ హక్కులతో బ్రేక్ ఈవెన్ అయిపోయాయి. అందువల్ల అక్కడ రిస్క్ లేదు.

కానీ వెంకీమామ అలా కాదు జెమిని శాటిలైట్ ఎనిమిది కోట్లు వచ్చింది. హిందీ ఎనిమిది కోట్లకు మాటలు అయ్యాయి. కానీ ఇప్పుడు వాళ్లు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే హిందీ మార్కెట్ పడిపోయిందని చెబుతూ, ముందు చెప్పిన రేట్లు హానర్ చేయడం లేదు. అమెజాన్ బేరాలు సాగుతున్నాయి. ఆరు నుంచి ఏడు కోట్లు వచ్చే అవకాశం వుంది.

అందువల్ల ఎలా చూసినా, విడుదలకు ముందు పాతిక కోట్లకు లోపే వచ్చే అవకాశం వుంది. ఇలాంటి టైమ్ లో పీపుల్స్ మీడియా సేఫ్ గా వుండాలంటే థియేటర్ బిజినెస్ చేసేసుకోవడం ఉత్తమం. కానీ మార్కెటింగ్ అంతా సురేష్ బాబు చేతిలో వుంది. రేటు కానీ, బయ్యర్లను కానీ ఆయనే ఫైనల్ చేయాలి. విడుదలకు ముందు కనుక మార్కెట్ చేసుకోకపోతే పాతిక కోట్ల టేబుల్ రిస్క్ తో విడుదల చేసుకోవాల్సి వుంటుంది.

వెంకీమామ డిసెంబర్ 13న విడుదల కావడానికి ఎక్కువ అవకాశాలు వున్నాయి. ఆ రోజు వెంకీ బర్త్ డే. ఇప్పటి వరకు వెంకీ బర్త్ డే నాడు ఆయన సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. ఇప్పుడు ఆ లోటు ఈ సినిమా తీర్చే అవకాశం వుంది.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?