విశ్వరూపం 2 ఎప్పుడొస్తుందో?

విశ్వరూపం సినిమానే కిందా మీదా పడి పూర్తి చేసాడు కమల్. ఆపై దానిపై వచ్చిన వివాదాలు, వగైరాలు కలిపి నానా గత్తర చేసాయి. అయితే లక్కీగా అవన్నీ ఆ సినిమాకు హైప్ గా మారి…

విశ్వరూపం సినిమానే కిందా మీదా పడి పూర్తి చేసాడు కమల్. ఆపై దానిపై వచ్చిన వివాదాలు, వగైరాలు కలిపి నానా గత్తర చేసాయి. అయితే లక్కీగా అవన్నీ ఆ సినిమాకు హైప్ గా మారి ప్లస్ అయ్యాయి. దీంతో కమల్ అప్పులు తీరిపోయాయి. ఇప్పుడు విశ్వరూపం 2 వుంది. అది కమల్ స్వంత ప్రాజెక్టు కాదు. బయట నిర్మాతకు ఇచ్చాడు. ఆ సినిమా దాదాపు పూర్తయింది కానీ విడుదల మాత్రం కాలేదు. 

ఈ లోగా కమల్ తన ఉత్తమ విలన్ పూర్తి చేసి విడుదలకు రెడీ చేసేసాడు. మరోపక్క దృశ్యం సినిమా తమిళ వెర్షన్ సెట్ పైకి వెళ్తోంది. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, విశ్వరూపం 2 సినిమా ఇప్పట్లో విడుదలయ్యే పరిస్థితి లేదని. ఉత్తమ విలన్ విడుదలై, హిట్ అయితే ఆ క్రేజ్ ను మరి కాస్త వాడుకుని, విశ్వరూపం 2 బయటకు రావచ్చు. లేకుంటే లేదు. ఆ సినిమా నిర్మాత వేణు  రవిచంద్రన్ కాస్త ఇబ్బందుల్లో వుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.