చైతూ ఓకే.. మరి సమంత సంగతేంటి..?

స్వయంగా నాగచైతన్య ప్రకటించడంతో చైతూ-సమంత పెళ్లి ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. ఎట్టిపరిస్థితుల్లో అక్టోబర్ లో పెళ్లి గ్యారెంటీ అని చైతూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. దీంతో వీళ్ల పెళ్లిపై ఇన్నాళ్లూ నడుస్తున్న స్పెక్యులేషన్…

స్వయంగా నాగచైతన్య ప్రకటించడంతో చైతూ-సమంత పెళ్లి ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. ఎట్టిపరిస్థితుల్లో అక్టోబర్ లో పెళ్లి గ్యారెంటీ అని చైతూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. దీంతో వీళ్ల పెళ్లిపై ఇన్నాళ్లూ నడుస్తున్న స్పెక్యులేషన్ కు చెక్ పడింది. అయితే అక్టోబర్ నాటికి వీళ్లిద్దరూ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అవుతాయా అనేదే పెద్ద డౌట్.

చైతూ ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను కంప్లీట్ చేశాడు. మరోవైపు కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కూడా దాదాపు సగం పూర్తిచేశాడు.  ప్రేమమ్ డైరక్టర్ చందు మొండేటితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా అక్టోబర్ నాటికి పూర్తిచేసేస్తాడు. ఎటొచ్చి సమంతతోనే చిక్కొచ్చిపడింది.

ప్రస్తుతం రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో నటిస్తోంది సమంత. ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. ఎంత స్లో గా షూటింగ్ జరిగినా అక్టోబర్ నాటికి కంప్లీట్ అయిపోతుంది. అది వేరే విషయం. కాకపోతే ఈ సినిమా లేట్ అయితే, ఆ ప్రభావం సమంత నటిస్తున్న మిగతా సినిమాలపై పడుతుంది. అప్పుడు అక్టోబర్ నాటికి ఇంకొన్ని సినిమాలు పెండింగ్ లో పడతాయి.

రామ్ చరణ్ – సుకుమార్ సినిమాతో పాటు రాజుగారి గది-2, మహానటి సినిమాలు అంగీకరించింది సమంత. వీటిలో రాజుగారి గది-2 ఆల్ మోస్ట్ ఓ కొలిక్కి వచ్చేసింది. మహానటి ఇంకా సెట్స్ పైకి రాలేదు. వీటితో పాటు అటు తమిళ్ లో ఏకంగా 3 సినిమాలకు కాల్షీట్లు ఇచ్చింది. మరి అక్టోబర్ నాటికి ఈ కమిట్ మెంట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయా అనేది డౌట్.