ఎవ్వరూ పిలవని వేళ పిలిచారు. చాలా కాలంగా దూరంగా వున్న స్టేజ్ దొరికింది. మైక్ చేతికి వచ్చింది. బండ్ల గణేష్ చెలరేగిపోయారు.
కానీ అది ఆయన నైజం కావచ్చు. కానీ అక్కడ వున్న పూరి ఫ్యామిలీకి ఏం వచ్చె? వారయినా తరువాత అసలు సంగతి చెప్పాలి కదా?
పూరి ఈ ఫంక్షన్ కు రాలేకపోయి వుండొచ్చు. కొడుకుతో సినిమాలు చేయలేదా? హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నించలేదా?
అంతెందుకు గతంలో పూరి తనయుడు ఆకాష్ వేదిక మీద తన తండ్రి గురించి ఏ రేంజ్ లో మాట్లాడాడు? ఈ చోర్ బజార్ సినిమా గురించి కూడా ప్రభాస్ తో మాట్లాడింది పూరి అన్న సంగతి బండ్లకు తెలియకపోవచ్చు.
ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో చార్మి చర్చలు జరుపుతోంది. ఆకాష్ పూరి తో సినిమా నిర్మాణానికి. ఈ సంగతి బండ్లకు తెలుసా?
కొడుకు కోసం తన స్క్రిప్ట్ లు, మాటలు అందించడం లాంటివి అన్నీ ఫ్రీగా చేయడానికి పూరి రెడీగా వున్నారు. ఈ మేరకు కొన్ని సమాలోచనలు జరుగుతున్నాయి,.
ఇవేవీ తెలియకుండా పూరి తన కుటుంబాన్ని వదిలేసారన్న కలరింగ్ వచ్చేలా బండ్ల మాట్లాడడం సరి కాదు కదా?