బెయిల్ పిటిష‌న్ వేసుకోవాల‌ని ఆర్జీవీకి సూచ‌న‌

ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న‌పై న‌మోదు చేసిన కేసు కొట్టి వేయాల‌ని ఏపీ హైకోర్టులో వేసిన పిటిష‌న్ డిస్మిస్ అయ్యింది. ఎన్నిక‌ల‌కు ముందు వ్యూహం సినిమాలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కల్యాణ్‌ల‌ను కించ‌ప‌రిచేలా కొన్ని సీన్లు వున్నాయంటూ…

ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న‌పై న‌మోదు చేసిన కేసు కొట్టి వేయాల‌ని ఏపీ హైకోర్టులో వేసిన పిటిష‌న్ డిస్మిస్ అయ్యింది. ఎన్నిక‌ల‌కు ముందు వ్యూహం సినిమాలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కల్యాణ్‌ల‌ను కించ‌ప‌రిచేలా కొన్ని సీన్లు వున్నాయంటూ ద‌ర్శ‌కుడు ఆర్జీవీపై ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ నాయ‌కుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదైంది.

ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. క్వాష్ పిటిష‌న్ వేసుకున్నారు. కానీ కేసు కొట్టి వేయ‌డానికి కోర్టు అంగీక‌రించ‌లేదు. ఒక‌వేళ అరెస్ట్ చేస్తార‌నే భ‌యం వుంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాల‌ని ఆర్జీవీకి ఏపీ హైకోర్టు సూచించింది.

విచార‌ణ తేదీని మ‌రో రోజుకు మార్చేలా ఆదేశించాల‌నే ఆర్జీవీ విన‌తిని కూడా కోర్టు అంగీక‌రించ‌లేదు. ఈ విజ్ఞ‌ప్తిని పోలీసుల‌కే చేసుకోవాల‌ని న్యాయ స్థానం సూచించింది. దీంతో ఆర్జీవీ ఏం చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నెల 19న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ఆర్జీవీ బెయిల్ పిటిష‌న్ వేసుకుంటారా? లేక మ‌రో రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని పోలీసుల‌కు స‌మాచారం ఇస్తారా? అనేది తేలాల్సి వుంది. ఆర్జీవీ కోరుకున్న‌ట్టు న్యాయ‌స్థానంలో ఊర‌ట ల‌భించ‌లేదు.

9 Replies to “బెయిల్ పిటిష‌న్ వేసుకోవాల‌ని ఆర్జీవీకి సూచ‌న‌”

  1. అయ్యో పాపం.. ఆర్జీవీ కి జగన్ రెడ్డి సైకోసైన్యం మద్దతు లాంటివి తెలపడం లేదా..?

    లేక..

    మద్దతు మొత్తం అల్లు అర్జున్ పైకి మళ్ళించారా..?

    మొన్నటికి మొన్న .. ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపారు..

    నిన్నటికి నిన్న.. తమిళ్ హీరో కార్తీ కి మద్దతు తెలిపారు..

    ఇప్పుడు మద్దతు మొత్తం అల్లు అర్జున్ పైకి మళ్లించారు..

    సింగల్ సింహాలకు.. ఈ మద్దతు “డిస్ట్రిబ్యూషన్” కష్టాలేమిటో.. ఎందుకోసమో ..

    1. ఎవరు మెగా ఫ్యామిలీ కి దూరం అని అనిపిస్తుందో… వారికే మా మద్ధత్తు. రేపు పొరపాటున aa గారు megafamily కలిసిపోతే మేం మా వికృత రూపం చూపించి aa గారిమీద విరుచుకుపడతాం. రజనీ గారి అంతటి వారినే వదల్లేదు మేం. బన్నీ గారు ఒక లెక్కా మాకు.

Comments are closed.