టాలీవుడ్ లో మరో 2 పెళ్లిళ్లు

ఇయర్ ఎండింగ్ లో పెళ్లిల్లు జోరందుకున్నాయి. టాలీవుడ్ నుంచి ఇద్దరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లలో ఒకరు దర్శకుడు సందీప్ రాజ్.

ఇయర్ ఎండింగ్ లో పెళ్లిల్లు జోరందుకున్నాయి. టాలీవుడ్ నుంచి ఇద్దరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లలో ఒకరు దర్శకుడు సందీప్ రాజ్.

కలర్ ఫొటో సినిమాతో ఫేమస్ అయిన దర్శకుడు సందీప్ రాజ్, పెళ్లి చేసుకున్నాడు. సందీప్ రాజ్, చాందినీ రావు వివాహం తిరుపతిలో ఘనంగా జరిగింది. హీరో సుహాస్ ఈ జంట పెళ్లికి కుటుంబసమేతంగా హాజరయ్యాడు.

సందీప్ రాజ్, చాందినీ రావు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చాందినీ రావు కూడా నటి. 3-4 సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్ లు చేసింది. గత నెల ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట, ఈరోజు పెళ్లితో ఒక్కటయ్యారు. హీరోయిన్లు దివ్య శ్రీపాద, ప్రియ వడ్లమాని, యాంకర్ సుమ కొడుకు రోషన్, వైవా హర్ష ఈ పెళ్లికి హాజరయ్యారు.

సాయికిరణ్ పెళ్లి కూడా.. నటుడు సాయికిరణ్ కూడా ఈరోజు మరోసారి వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నాడు. తనతో పాటు ఓ సీరియల్ లో కలిసి నటిస్తున్న స్రవంతిని ఆయన ఈరోజు తన అర్థాంగిగా చేసుకోబోతున్నాడు. గత నెలలో వీళ్ల నిశ్చితార్థం జరిగింది.

సాయికిరణ్ కు ఇది వరకే పెళ్లయింది. ఓ కూతురు కూడా ఉంది. అయితే భార్యతో ఆయన విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు స్రవంతితో కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నాడు. ఆయన వయసు 46 ఏళ్లు.

13 Replies to “టాలీవుడ్ లో మరో 2 పెళ్లిళ్లు”

Comments are closed.