తప్పులు హీరోలవి.. తిప్పలు నిర్మాతలవి

కేవలం రెండే రెండు పేమెంట్ల కోసం నిర్మాతలు నల్ల ధనాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఒకటి హీరోల రెమ్యూనిరేషన్. రెండు దర్శకుల రెమ్యూనిరేషన్.

జిఎస్టీ పద్దతి వచ్చిన తరువాత, టీడీఎస్ పద్దతి అలవాటైన తరువాత, కేసులు, అరెస్ట్ లు అనేవి పెరిగిన తరువాత టాలీవుడ్ లో నల్లధనం అన్నది 90శాతం కనుమరుగైపోయింది. అనకూడదు కానీ లక్షో రెండు లక్షలో బ్లాక్ కావాలన్నా దొరకని పరిస్థితి అయింది నిర్మాణ సంస్థల్లో. ప్రతి ఒక్కరు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ అలవాటు చేసేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా నెప్ట్ కొట్టడం అన్నది కామన్ అయింది. ఆఖరికి అప్పులు ఇచ్చే ఫైనాన్షియర్లు కూడా ఆన్ అకౌంట్ మాత్రమే అప్పులు ఇస్తున్నారు.

మరి ఇలాంటి నేపథ్యంలో ఐటి దాడులకు నిర్మాతలు ఎందుకు భయపడాలి. ఇంకా నల్లధనం ట్రాన్సాక్షన్ ఏమైనా జరుగుతోందా? ఎస్ జరుగుతోంది. కేవలం రెండే రెండు పేమెంట్ల కోసం నిర్మాతలు నల్ల ధనాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది.

ఒకటి హీరోల రెమ్యూనిరేషన్. రెండు దర్శకుల రెమ్యూనిరేషన్. దర్శకులు అంటే బడా దర్శకులు. పది కోట్లు ఆపై నుంచి వంద కోట్ల వరకు తీసుకునే దర్శకులు. వీరికి కొంత వరకు బ్లాక్ సర్దుబాటు చేయాలి.

ఇక హీరోలు. హీరోలు ఎవరైనా సరే, నాలుగైదు కోట్లు తీసుకునే వారి దగ్గర నుంచి నలభై యాభై కోట్లు తీసుకునే వారి వరకు సగానికి సగం బ్లాక్ ఇవ్వాల్సి వస్తోందని ఒక నిర్మాత తెలిపారు. అందుకోసం కచ్చితంగా బ్లాక్ కోసం వేటాడి తేవాల్సి వస్తోందని, లేదంటే తమకు బ్లాక్ అవసరమే లేదని అన్నారు.

అంతే కాదు, ఇలా బ్లాక్ లో తెచ్చిన దానికి నెల నెలా బ్లాక్ లోనే వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పు తెచ్చే కదా హీరోలకు కోట్లకు కోట్లు అడ్వాన్స్ ఇచ్చేది. అలా నెల నెలా వడ్డీలు కట్టడానికి మళ్లీ బ్లాక్ మనీ కోసం వెదకాల్సి వస్తోందని వెల్లడించారు.

గమ్మత్తేమిటంటే ఎప్పుడూ నిర్మాతల మీద దాడుల వార్తలు వినిపిస్తాయి కానీ హీరోల ఇళ్ల మీద సోదాలు జరిగిన వార్తలు వినిపించాయా అని కొందరు నిర్మాతలు ప్రశ్నించడం విశేషం.

6 Replies to “తప్పులు హీరోలవి.. తిప్పలు నిర్మాతలవి”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ఇండియా లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కి 10% కంటే ఎక్కువ టాక్స్ అడిగితే అది దోపిడి కిందే లెక్క.

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.