కళ్యాణ్ రామ్ సినిమా వెనక్కి

బింబిసార తో హిట్ కొట్టి ట్రాక్ మీదకు వచ్చారు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో పాటే సైలంట్ గా మరో సినిమా కూడా రెడీ అయిపోయింది. అది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో. …

బింబిసార తో హిట్ కొట్టి ట్రాక్ మీదకు వచ్చారు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో పాటే సైలంట్ గా మరో సినిమా కూడా రెడీ అయిపోయింది. అది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో. 

ఈ దసరా సీజన్ లో విడుదల కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది వెనక్కు వెళ్లింది. కారణం మరేమీ కాదు. బింబిసార సక్సెస్ నేపథ్యంలో మరిన్ని మెరుగులు దిద్ది, మరిన్ని మార్పులు చేసి విడుదల చేయాలని అనుకోవడమే.

ఇలా చేయాలంటే టైమ్ సరిపోదు కనుక డిసెంబర్ కు వాయిదా వేసేసారు. బింబిసార సినిమా తరువాత హీరో కళ్యాణ్ రామ్-నిర్మాతలు కలిసి ఈ కొత్త దర్శకుడి సినిమాకు మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా. ఆ మేరకు చర్చలు సాగిస్తున్నారు. అవి ఒక కొలిక్కి వచ్చాక. షూట్ చేయాల్సి వుంటుంది.

ఇది కాక దిల్ రాజు నిర్మాణంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయాల్సి వుంది. అది ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. ఇవన్నీ పూర్తయ్యాకనే బింబిసార 2 ప్రాజెక్టు అన్నది వుంటుంది. అప్పటి వరకు బింబిసార 2 సినిమా స్క్రిప్ట్ వర్ పని జరుగుతుంటుంది.