ఏడాదిన్నర ప్రేమించిన తర్వాత ప్రపోజ్ చేశాడు

ప్రేమిస్తే ఆ విషయాన్ని ఘనంగా బయట చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. లవ్ లో పడ్డమే ఆలస్యం ప్రకటించుకుంటున్నారు చాలామంది నటీనటులు. హీరో కిరణ్ అబ్బరవరం దీనికి పూర్తి రివర్స్. రీసెంట్ గా హీరోయిన్ రహస్యను…

ప్రేమిస్తే ఆ విషయాన్ని ఘనంగా బయట చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. లవ్ లో పడ్డమే ఆలస్యం ప్రకటించుకుంటున్నారు చాలామంది నటీనటులు. హీరో కిరణ్ అబ్బరవరం దీనికి పూర్తి రివర్స్. రీసెంట్ గా హీరోయిన్ రహస్యను నిశ్చితార్థం చేసుకున్న ఈ హీరో, ఎట్టకేలకు తన లవ్ మేటర్ ను బయటపెట్టాడు.

“రాజావారు రాణిగారు సినిమా నుంచే మేమిద్దరం కనెక్ట్ అయ్యాం. నా మైండ్ సెట్ కు దగ్గరగా ఉంది తను. నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో అలా ఉంది రహస్య. నా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి దగ్గరగా ఉంది. ఐదేళ్లుగా మేం రిలేషన్ షిప్ లో ఉన్నాం. నా వ్యక్తిగత విషయాల్ని బయటకు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా క్లోజ్ సర్కిల్ కు మాత్రం తెలుసు. నిశ్చితార్థం కూడా ప్రైవేట్ గా చేసుకుందాం అనుకున్నాను, కానీ మీడియా అంతా కవర్ చేసింది.”

రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ ఐ లవ్ యు చెప్పుకోలేదంట ఈ జంట. రిలేషన్ షిప్ మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత చెప్పుకున్నారట. అది కూడా చాలా అనుకోకుండా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు అబ్బవరం. ప్రేమలో ఉన్నామని ఇద్దరికీ తెలుసని, కానీ ప్రపోజ్ చేసుకోవడానికి మాత్రం ఏడాదిన్నర పట్టిందంటున్నాడు. అప్పటికే ఇద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నట్టు తెలిపాడు.

గత నెల కిరణ్ అబ్బవరం-రహస్య ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆగస్ట్ లో వీళ్లు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. గతేడాది రూల్స్ రంజన్ సినిమాను రిలీజ్ చేసిన కిరణ్, ఈ ఏడాదికి ఇప్పటివరకు ఇంకా సినిమా సిద్ధం చేయలేదు. ఈ గ్యాప్ లో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నాడు.