పది రోజులుగా సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ అయ్యారు సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ. నెటిజన్లు అడుగుతున్న దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు హీరోలపై ఆయన ఆసక్తికర ప్రకటనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు, రామ్ చరణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
“మహేష్ తో సినిమా ఇక కష్టం. రాజమౌళి ది గ్రేట్ తో చేస్తున్న సినిమా తర్వాత మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు. సో.. ఆ తర్వాత జేమ్స్ బాండ్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. డేనియల్ క్రెయిగ్ పనైపోయింది, తర్వాత జేమ్స్ బాండ్ మన బాబు అవ్వాలనేది నా కోరిక.”
ఇలా మహేష్ తో సినిమాపై స్పందించారు కృష్ణవంశీ. రాజమౌళితో సినిమా తర్వాత ఎవ్వరికీ అందనంత ఎత్తులో మహేష్ ఉంటారని, ఇక ఆయనతో తను సినిమా చేయలేననే అర్థం వచ్చేలా స్పందించారు.
తాజాగా రామ్ చరణ్ పై కూడా రియాక్ట్ అయ్యారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గోవిందుడు అందరివాడేలే సినిమా వచ్చింది. ఈసారి చరణ్ తో మరో సినిమా చేయాలని, ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలని ఓ మెగాభిమాని కోరాడు. దీనిపై కృష్ణవంశీ స్పందించారు.
చరణ్ తో సినిమా చేయడానికి తను సిద్ధంగానే ఉన్నానని, కాకపోతే రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారని, లైఫ్ లాంగ్ ఆయన అలానే బిజీగా ఉండాలని తను కోరుకుంటున్నట్టు తెలిపారు. చరణ్ కూడా రాజమౌళితో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
Call boy jobs available 8341510897
maree soap vestunnadu
జనం పట్టించుకోరు
థియేటర్లో చూడటం కష్టం.. ఓటిటిలో అయితే రెడీ