Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రభాస్ తో డేటింగ్ పై స్పందించిన హీరోయిన్

ప్రభాస్ తో డేటింగ్ పై స్పందించిన హీరోయిన్

ప్రభాస్, కృతి సనన్ ప్రేమించుకుంటున్నారట.. 2 రోజులుగా వైరల్ అవుతున్న మేటర్ ఇది. ప్రభాస్ మనసులో కృతి సనన్ పేరు ఉందంటూ స్వయంగా మరో హీరో వరణ్ ధావన్ ప్రకటించడం దీనికి ప్రధాన కారణమైంది. ఓ టీవీ షోలో పాల్గొన్న వరుణ్ ధావన్, కృతి సనన్ పేరు మరో హీరో మనసులో ఉందని, ప్రస్తుతం అతడు దీపికా పదుకోన్ తో కలిసి షూటింగ్ లో ఉన్నాడని అన్నాడు.

దీంతో ప్రభాస్-కృతి సనన్ ప్రేమించుకుంటున్నారంటూ దాదాపు అన్ని వార్తామాధ్యమాల్లో వార్తలు వచ్చేశాయి. ఎందుకంటే, ఆ మేటర్ బయటపెట్టింది స్వయంగా మరో హీరో కాబట్టి. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై హీరోయిన్ కృతి సనన్ స్పందించింది. ప్రభాస్ తో తను డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది.

"ఇది ప్రేమ కాదు, అలా అని ప్రచారం కోసం చేసింది కూడా కాదు. మా హీరో ఓ రియాలిటీ షోలో కాస్త వైల్డ్ గా ప్రవర్తించాడు. అతడి మాటలు పుకార్లకు దారితీశాయి. ఏదో ఒక వెబ్ సైట్ నా పెళ్లి తేదీని కూడా ప్రకటించకముందే నేను రియాక్ట్ అయిదే బాగుంటుందని స్పందిస్తున్నాను. నాపై వస్తున్న పుకార్లు నిరాధారమైనవి. అదంతా ఫేక్ న్యూస్."

ఇలా ప్రభాస్ తో డేటింగ్ అంటూ వస్తున్న పుకార్లను ఖండించింది కృతి సనన్. ప్రభాస్, కృతి కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా