అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ టైటిల్ లోనే వుంది పక్కా మాస్ సెంటర్ సినిమా అని. అలాంటి సినిమా నుంచి పాట వచ్చింది.
సుహాస్ హీరో. శివానీ హీరోయిన్. గుమ్మా..నీ పాదం మోపగా..యమ్మా అంటూ ఈ పాట డిఫరెంట్ బీట్ తో సాగింది. కొద్దిగా ర్యాప్, కొద్దిగా బీట్ మిక్స్ చేసి ఓ మాస్ స్టయిల్ ను క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది. రెహమాన్ అందించిన లిరిక్స్ కు..శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
ఈ సినిమాను గీతా2 సంస్థ మీద బన్నీవాస్, అలాగే ధీరజ్ మొగిలినేని, వెంకటేష్ మహా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో మెంబర్ గా, సెలూన్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ఇది. కొత్త దర్శకుడు దుష్యంత్ ఈ సినిమాను అందిస్తున్నారు.
డిఫరెంట్ చిన్న సినిమాలను ఎంచుకుని మరీ వివిధ భాగస్వామ్యాలతో నిర్మిస్తున్నారు బన్నీ వాస్. అలాంటి వాటిలో ఈ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటి.