స్టయిలిష్ స్టార్ బన్నీ కన్నడ మీడియాకు సారీ చెప్పారు. ముందుగా అన్న సమయం కన్నా రెండు గంటలు లేటుగా వచ్చినందుకు ఆయన సారీ చెప్పాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ కు చెప్పిన సమయం కన్నా రెండుగంటల లేటుగా వచ్చారు.
ప్రసంగాలు అయిన తరువాత క్వశ్చను ఆన్సర్ సెషన్ స్టార్ట్ అయింది. సెషన్ ఇలా స్టార్ట్ కాగానే ఓ జర్నలిస్ట్ లేచి ఆలస్యం అయిన విషయాన్ని ప్రస్తావించారు.
పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ లు, కెమేరామెన్ లు రెండు గంటల పాటు వేచి వుండాల్సిన పరిస్థితి వివరించారు. కన్నడంలో చెప్పడంతో బన్నీకి అర్థం కాలేదు. హీరోయిన్ రష్మిక వివరించి చెప్పాల్సి వచ్చింది.
ఆ వెంటనే బన్నీ లేచి సారీ చెప్పారు. తను చార్టర్ ఫ్లయిట్ లో వచ్చానని, ఉదయాన్నే ఫాగ్ వల్ల టేకాఫ్ లేట్ అయిందని వివరించారు. అయినా తను సారీ చెబుతున్నానని, సారీ చెప్పడం వల్ల మనిషి పెరుగతాడే తప్ప తరగడు అని ఆయన అన్నారు. మీకు అక్కరలేకపోయినా, తను సారీ చెబుతా అని ముక్తాయించాడు బన్నీ.