దర్శకుడు నాగ్ అశ్విన్ కనిపిస్తే ఎవరైనా ఫస్ట్ అడిగేది కల్కి-2 స్టేటస్ గురించే. తక్కువగా కనిపించే ఈ డైరక్టర్ మీడియా ముందుకొచ్చాడు. వస్తూనే కల్కి-2 గురించి మాత్రం అడగొద్దు అని కండిషన్ పెట్టి మరీ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాడు.
దర్శకుడు అడగొద్దన్నప్పటికీ పాత్రికేయులు ఆగలేకపోయారు. కల్కి-2 గురించి అడుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అసలు కల్కి-2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయి. దీనికి నాగ్ అశ్విన్ తెలియదు అని సమాధానం ఇచ్చాడు. ఈ ప్రశ్నలు నిర్మాతను అడగాలని సూచించాడు.
మరికొన్నింటికి చెప్పను అంటూ నవ్వుతూ రిప్లయ్ ఇచ్చాడు. అయితే అలా చెప్పను అంటూనే కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చాడు ఈ దర్శకుడు.
కల్కి-2 సినిమాను ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానంటున్నాడు. పార్ట్-2కు సంబంధించి ఇంకా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందంట. మొదటి పార్ట్ లో ప్రభాస్ స్క్రీన్ టైమ్ తగ్గింది. రెండో పార్ట్ లో అలాంటి అనుమానాలు అక్కర్లేదంటున్నాడు.
“ఫస్ట్ పార్ట్ లో మహాభారతం సెట్ చూపించాం. సుమతి, అశ్వద్ధామ పాత్రలు చూపించాం. అవన్నీ చూపిస్తూ పార్ట్-2 వరకు వచ్చాం. సో.. పరిచయాలు, స్టోరీలైన్ అన్నీ అయిపోయాయి. మిగిలింది ఓన్లీ భైరవ, కర్ణ యాంగిల్స్ మాత్రమే. రెండో భాగం మొత్తం అదే నడుస్తుంది. ప్రభాస్ సినిమా మొత్తం కనిపిస్తాడు.”
మొత్తానికి కల్కి-2 రిలీజ్ పై ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోలేదని వెల్లడించాడు నాగ్ అశ్విన్. ఈ గ్యాప్ లో మరో సినిమా తీయడమో లేక నిర్మించడమో చేయొచ్చని, కానీ తన టైమ్ మొత్తం కల్కి-2తోనే అయిపోతోందన్నాడు.
Waiting sir eskada
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
మధ్యలో ఇంకో సినిమా ఏదైనా చేయొచ్చు కదా రాజమౌళి మర్యాద రామన్న సినిమా చేసినట్టు