గేమ్ ఛేంజ‌ర్ సందడే లేదే!

సెప్టెంబర్ లో దేవర..అక్టోబర్ లో కంగువ, వేట్టయ్యన్, డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ ఛేంజ‌ర్ ఈ అయిదు సినిమాలు మిగిలాయి

రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ సినిమా గేమ్ ఛేంజ‌ర్. దీపావళి కి కానీ, డిసెంబర్ లో కానీ వస్తుందని టాక్ వుంది. దీపావళికి వస్తున్నాం అంటూ లక్కీ భాస్కర్ డేట్ ప్రకటించేసారు. అంటే ఇక గేమ్ ఛేంజ‌ర్ కు మిగిలింది డిసెంబర్ డేట్ ఒక్కటే. అదే డిసెంబర్ లో పుష్ప 2 కూడా రావాల్సి వుంది. అది అలా వుంచితే ఇప్పటి వరకు గేమ్ ఛేంజ‌ర్ నుంచి ఒక్క పాట మాత్రమే వచ్చింది. మరో పాట ఎప్పుడు వస్తుందని జ‌నం చూస్తున్నారు.

ఇటీవల థమన్ కలిసినపుడు అడిగితే త్వరలో రెండో పాట వస్తుందని చెప్పారు. కానీ అలా వచ్చే సూచనలు ఏవీ కనిపించడం లేదు. కనీసం ఓ వారం ముందు ప్రకటన ఇవ్వడం మామూలుగా జ‌రుగుతుంటుంది. అందువల్ల సెప్టెంబర్ 7 అంటే వినాయకచవితికి పాట ఇచ్చే ఉద్దేశం వుంటే వచ్చే వారంలో అనౌన్స్ మెంట్ రావచ్చేమో? డిసెంబర్ లో సినిమా అంటే అక్టోబర్ నుంచి కంటెంట్ ఎక్కువగా విడుదల చేసే అవకాశం వుంది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జ‌రుగుతోందని వార్తలు వున్నాయి. సినిమా షూట్ అంతా అయితే అయిపోయింది. శంకర్ లాంటి దర్శకులు రెండు నెలలు తీసుకుంటారు పోస్ట్ ప్రోడక్షన్ కు. అందువల్ల అక్టోబర్ చివరకు కాపీ రెడీ అయిపోవచ్చు. టైమ్ టైట్ అవుతుందని దీపావళికి విడుదల ప్లాన్ చేసి వుండకపోవచ్చు.

సెప్టెంబర్ లో దేవర..అక్టోబర్ లో కంగువ, వేట్టయ్యన్, డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ ఛేంజ‌ర్ ఈ అయిదు సినిమాలు మిగిలాయి. ఇవి కాక లక్కీ భాస్కర్, మెకానిక్ రాఖీ లాంటి రెండు మూడు మిడ్ రేంజ్ సినిమాలు వున్నాయి. కానీ చిన్న, బుల్లి సినిమాలు చాలానే వున్నాయి మిగిలిన నాలుగు నెలల్లో విడుదలకు.

9 Replies to “గేమ్ ఛేంజ‌ర్ సందడే లేదే!”

  1. నిద్రపోతున్నావా… క్రిస్మస్ కి వస్తున్నాం అని దిల్ రాజు ప్రకటించాడు… డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ట్వీట్ వేసింది

  2. Song teaser was horrible. Indian 2 result tarvaata Dil raju reddy would be literally shaking shaking. Reddy gaani business ee debbaki khel khatam dukan band aithadaa endi. poyi poyi shankar gaaditho pettukunnadu. anavasaram gaa madhyalo maa mega future ram charan bhayya ni irikinchaaru kada raa.

Comments are closed.