Advertisement

Advertisement


Home > Movies - Movie News

దేవరపై ఎన్టీఆర్ తొలి పబ్లిక్ స్టేట్ మెంట్

దేవరపై ఎన్టీఆర్ తొలి పబ్లిక్ స్టేట్ మెంట్

కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు తారక్. ఆర్ఆర్ఆర్ లాంటి సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంటి ప్రమోషనల్ మెటీరియల్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడీ సినిమాపై తొలిసారి పబ్లిక్ గా స్పందించాడు ఎన్టీఆర్. అందరూ తమ కాలర్ ఎగరేసేలా దేవర సినిమా ఉంటుందని ప్రకటించి, అంచనాలు పెంచేశాడు. దేవర సినిమాపై ఎన్టీఆర్ ఇచ్చిన తొలి పబ్లిక్ స్టేట్ మెంట్ ఇది.

"కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే చిన్న విషయం చెబుతాను. ఈరోజు చొక్కా వేసుకొచ్చాను. చొక్కాకు కాలర్ ఉంటుంది. దేవర అనే సినిమా మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది. రిలీజ్ కాస్త లేట్ అయినప్పటికీ ఇది మాత్రం పక్కా. దేవర చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షక దేవుళ్లకు అందించడానికి మేం ప్రయత్నిస్తాం."

ఇలా దేవరపై తొలిసారి బహిరంగ ప్రకటన చేశాడు ఎన్టీఆర్. టిల్లూ స్క్వేర్ సినిమా వంద కోట్లు కొల్లగొట్టిన సందర్భంగా సక్సెస్ మీట్ కు హాజరైన ఎన్టీఆర్, ఆ టీమ్ ను మెచ్చుకుంటూనే, తన ప్రసంగం చివర్లో ఇలా ఆసక్తికర ప్రకటన చేశాడు.

దేవర సినిమా చెప్పిన టైమ్ కు రాలేకపోయిందని, వాయిదా పడినందుకు తనకు కూడా బాధగానే ఉందనే భావాన్ని ఎన్టీఆర్ తన మాటల్లో పరోక్షంగా వ్యక్తం చేశాడు. అయితే ప్రేక్షకుల వెయిటింగ్ కు, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దేవర ఉంటుందని భరోసా ఇచ్చాడు. ఇన్నాళ్లూ ఈ సినిమాపై కొరటాల, కల్యాణ్ రామ్ మాత్రమే ప్రకటనలు చేయగా.. తొలిసారి ఎన్టీఆర్ దేవరపై రియాక్ట్ అయి మరింత అంచనాలు పెంచాడు.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వస్తున్న సినిమా ఇది. జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా పరిచయమౌతున్నాడు. 2 భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?