ఈ ఏడాది ఒక సినిమాతోనే సరి

వరుణ్ తేజ్ నుంచి ఈ ఏడాది కచ్చితంగా 2 సినిమాలు వస్తాయని అంతా భావించారు. వరుణ్ కూడా అలానే ప్లాన్ చేశారు. ఓవైపు పెళ్లి పెట్టుకొని మరీ, మరోవైపు సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తి…

వరుణ్ తేజ్ నుంచి ఈ ఏడాది కచ్చితంగా 2 సినిమాలు వస్తాయని అంతా భావించారు. వరుణ్ కూడా అలానే ప్లాన్ చేశారు. ఓవైపు పెళ్లి పెట్టుకొని మరీ, మరోవైపు సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేశాయి. అయినప్పటికీ, వరుణ్ తేజ్ నుంచి ఈ ఏడాది 2 సినిమాలు రావడం లేదు. అతడి అప్ కమింగ్ మూవీ వాయిదా పడింది.

ఆపరేషన్ వాలంటైన్.. వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ ఇది. పెళ్లి తర్వాత వరుణ్ నుంచి వస్తున్న సినిమా కూడా ఇదే. పైగా వరుణ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా రిలీజ్ కూడా. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో వస్తున్న ఈ మూవీ లెక్కప్రకారం, డిసెంబర్ 8న థియేటర్లలోకి రావాల్సి ఉంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అయితే వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

హిందీ మార్కెట్లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను ప్రచారం చేయడానికి తగినంత సమయం లేదంట. అందుకే సినిమాను వాయిదా వేయాలని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పైగా ఆ తేదీకి నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ టార్డినరీ మేన్ సినిమాలు రెడీగా ఉన్నాయి. దీంతో ఆపరేషన్ వాలంటైన్ ను వాయిదా వేయడమే ఉత్తమమని భావిస్తున్నారు.

యదార్ధ ఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. మానుషి చిల్లర్ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఇందులో ఆమె  రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించింది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు.