పవన్ కు టైం లేదా.. ఇంట్రెస్ట్ లేదా?

చేతిలో ఉన్న సినిమాలు చేయడానికి మొన్నటివరకు పవన్ కల్యాణ్ కు టైమ్ లేదనుకున్నాం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, టైమ్ సమస్య కాదు, అసలు సమస్య ఆయనకు ఆసక్తి లేకపోవడమే.

చేతిలో ఉన్న సినిమాలు చేయడానికి మొన్నటివరకు పవన్ కల్యాణ్ కు టైమ్ లేదనుకున్నాం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, టైమ్ సమస్య కాదు, అసలు సమస్య ఆయనకు ఆసక్తి లేకపోవడమే. ఎందుకో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు పూర్తిచేయడానికి పవన్ ఇంట్రెస్ట్ చూపించడం లేదనిపిస్తోంది.

నిజంగా రాజకీయ-ప్రభుత్వ కార్యక్రమాలుంటే అర్థం చేసుకోవచ్చు. వాటిని తప్పించి, సినిమా సెట్స్ పైకి రావడం కాస్త కష్టమైన వ్యవహారమే. కానీ ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లేవ్. కేవలం ఆలయాల పర్యటన పెట్టుకున్నారు.

మొన్నటికిమొన్న పవన్ పై నమ్మకంతో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. షూటింగ్ ఇలా మొదలైందో లేదో పవన్ కు జ్వరం వచ్చింది. స్పాండిలైటిస్ కూడా ఉందంటూ పార్టీ నుంచి ప్రకటన.

దాన్నుంచి కోలుకున్న తర్వాతైనా సినిమా స్టార్ట్ చేయాలి కదా. సనాతన ధర్మ పరిరక్షణ పేరిట దక్షిణాదిన ఉన్న కొన్ని ఆలయాన్ని సందర్శించాలని ఫిక్స్ అయ్యారు పవన్ కల్యాణ్. ఇంతకుముందు ఈ షెడ్యూల్ వినిపించలేదు. ఉన్నఫలంగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఓ 2 వారాలు సినిమాలు పూర్తిచేసి, అప్పుడు ఆలయాల సందర్శన పెట్టుకుంటే సరిపోయేది. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా సరిగ్గా షూటింగ్ ఉన్న టైమ్ లో ఆరోగ్యం బాగాలేకపోవడం, ఆకస్మిక కార్యక్రమాలు షెడ్యూల్ అవ్వడం లాంటివి జరిగాయి.

ప్రతిసారి షూటింగ్ టైమ్ లోనే ఎందుకిలా జరుగుతోంది? పవన్ కు సినిమాలు పూర్తిచేయాలనే ఆసక్తి లేదా? లేక, తెరవెనక ఇంకేమైనా కారణాలున్నాయా?

14 Replies to “పవన్ కు టైం లేదా.. ఇంట్రెస్ట్ లేదా?”

  1. బ్రొకరాంధ్ర కి పిచ్చి పట్టి ఏమ్ రాయలో తెలియక ఇలాంటి పనికిమాలిన కథనాలు రాస్తునట్టుంది.🤣🤣

  2. చేతిలో ఉన్న సినిమాలు చేయడానికి మొన్నటివరకు పవన్ కల్యాణ్ కు టైమ్ లేదనుకున్నాం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, టైమ్ సమస్య కాదు, అసలు సమస్య ఆయనకు ఆసక్తి లేకపోవడమే.

Comments are closed.