ఇదేదో.. బాగానే వుండేలా కనిపిస్తోందే!

ట్రయిలర్ కట్ డిఫరెంట్ గా ట్రయ్ చేసారు. అలా కాకుండా సినిమా లైన్ లోనే మధ్యలో గ్యాప్స్ లేకుండా వేరే విధంగా కూడా కట్ చేసి వుండొచ్చు.

పోటీలోకి లాస్ట్ ఎంట్రీ అన్నట్లు కనిపిస్తూ వస్తోంది బ్రహ్మాఆనందం అనే చిన్న సినిమా. బ్రహ్మానందం, ఆయన కొడుకు గౌతమ్, వెన్నెల కిషోర్ కీలకపాత్ర ధారులు. రాహుల్ యాదవ్ నిర్మాత. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్.. ఏదో ట్రయ్ చేస్తున్నారు అనేట్లుగా వుంది. ట్రయిలర్ వచ్చింది. ఏదో కాదు.. సమ్ థింగ్ వుండేలా వుంది..అనిపించింది. నిర్మాతకు అభిరుచి వుంది. ఆయన సినిమాలు అన్నీ ఇలా లాస్ట్ ఎంట్రీ అన్నట్లు వచ్చి హిట్ కొట్టినవే. ట్రయిలర్ చూస్తే ఇది కూడా స్లో అండ్ స్టడీ అన్నట్లు కనిపిస్తోంది.

లైన్ పెద్దగా కొత్తగా ఏమీ లేదు. ఎవరూ లేని కుర్రాడు. ఏదో డబ్బు అవసరం. ఆశపెట్టి దగ్గరకు తీసిన పెద్దాయిన. కథ విలేజ్ కు షిఫ్ట్. అక్కడ బోలెడు పాత్రలు. అసలు సిసలు జీవితం కళ్ల మందుకు వచ్చిన వైనం..చివరకు ఏమైంది.. సింపుల్ గా చెప్పడానికి ఇలా వుంది కానీ సినిమాలో చాలానే వుండేలా వుంది.

ట్రయిలర్ కట్ డిఫరెంట్ గా ట్రయ్ చేసారు. అలా కాకుండా సినిమా లైన్ లోనే మధ్యలో గ్యాప్స్ లేకుండా వేరే విధంగా కూడా కట్ చేసి వుండొచ్చు. అప్పుడు కాస్త ఫాస్ట్ ఫేస్ గా వుండేది. కానీ ఈ సినిమా మీద ట్రయిలర్ చూసే వాళ్లకు ఓ రిలేషన్ రావాలి. ఓ ఫీల్ రావాలి అని ఆలోచన ఈ ట్రయిలర్ వెనుక వున్నట్లుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ సినిమా వచ్చి చాలా రోజులు అయింది. ఆ లోటు తీరిస్తే ఏమో..గుర్రం ఎగరా వచ్చు.

అన్నట్లు..ఈ సినిమాకు దర్శకుడు ఆర్ వి ఎస్ నిఖిల్.

5 Replies to “ఇదేదో.. బాగానే వుండేలా కనిపిస్తోందే!”

  1. స్టోరీ అంతా “11 మేకల” చుట్టూ తిరుగుతుందంట.. బాయ్ కాట్ చూసేద్దామా..

    కమాన్ గొర్రెలు.. స్టార్ట్ ది మ్యూజిక్..

Comments are closed.