ఒక్క సినిమా హిట్ అయితే చాలు, కళ్లుమూసుకొని పారితోషికం పెంచేస్తున్న రోజులివి. డిమాండ్ ఉన్నప్పుడే రేటు పెంచాలంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చిన సందర్భాలు గతంలో చూశాం. మరి అలాంటప్పుడు బాహుబలి-2 లాంటి చారిత్రాత్మక విజయం తర్వాత ప్రభాస్ తన పారితోషికాన్ని ఎంత పెంచాలి? సాహో సినిమా కోసం అతడు ఎంత తీసుకున్నాడు?
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యూనరేషన్ పై స్పందించాడు ప్రభాస్. అంతా ఊహించినట్టు తను రేటు పెంచలేదని స్పష్టం చేశాడు. అంతేకాదు, ఈ సందర్భంగా ఓ పెద్ద ట్విస్ట్ కూడా ఇచ్చాడు. రెగ్యులర్ గా తీసుకునే పారితోషికం కూడా తీసుకోలేదట ప్రభాస్.
“బాహుబలి తర్వాత పారితోషికం బాగా పెంచానని అంతా అనుకుంటున్నారు. కానీ సాహో కోసం తీసుకోవాల్సిన ఎమౌంట్ కంటే చాలా తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే సాహో కోసం మేం అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు రెట్టింపు అయింది. సినిమా కోసం దాదాపు 350 కోట్లు ఖర్చు అయింది. పైగా నిర్మాతలంతా నా ఫ్రెండ్స్, మేమంతా కలిసి పెరిగాం. అలాంటప్పుడు నేనెలా ఫుల్ పేమెంట్ తీసుకుంటాను. వాళ్లంత ఖర్చు పెట్టినప్పుడు నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోలేను. అందుకే నా పారితోషికంలో 20 శాతం మాత్రమే తీసుకున్నాను.”
ఇలా తన పారితోషికంలో 20శాతం మాత్రమే తీసుకున్నానని ప్రకటించాడు ప్రభాస్. అంటే కోటి రూపాయల దగ్గర 20 లక్షలు మాత్రమే చార్జ్ చేశాడన్నమాట. అయితే భవిష్యత్తులో కూడా ప్రభాస్ ఇలానే బడ్జెట్ పెరిగితే తన రేటు తగ్గించుకుంటాడని చెప్పలేం. ఎందుకంటే, యూవీ క్రియేషన్స్ అనేది దాదాపు ప్రభాస్ సొంత బ్యానర్ లాంటిది. అందుకే రెమ్యూనరేషన్ తగ్గించుకొని ఉంటాడు.