నిర్మాత.. బయ్యర్.. ఎగ్జిబిటర్

ఇలా ఎవరి బాధలు వారికి వున్నాయి. ఇవన్నీ టాలీవుడ్ నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు తెలుసు

నిర్మాత వేరు, డిస్ట్రిబ్యూటర్ వేరు, బయ్యర్ వేరు, ఎగ్జిబిటర్ వేరు. వాటి వాటి వ్యాపార సమస్యలు వేరు.. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పని చేస్తుంది. ఒకరి సమస్య పరిష్కరిస్తే మరొకరికి ఇబ్బంది కావచ్చు. మరొకరి సమస్య పరిష్కరిస్తే ఇంకొకరికి ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే ఎవరి వ్యాపార ప్రయోజనాలు వారివి. ఇద్దరూ వేరు వేరు అయినపుడు సమస్యల పరిష్కారం ఒకలా వుంటుంది. రెండు వ్యవస్థలను ఒకరే నియంత్రిస్తుంటే సమస్యల పరిష్కారం మరోలా వుంటుంది. టాలీవుడ్ లో ఇప్పుడు అదే అసలు సమస్య.

నిర్మాతలే డిస్ఠ్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. నిర్మాతలే థియేటర్లు రన్ చేస్తూ ఎగ్జిబిటర్లుగా వున్నారు. ఇక్కడ నిర్మాత క్షేమమే డిస్ట్రిబ్యూటర్ క్షేమంగా, ఎగ్జిబిటర్ క్షేమంగా మారుతోంది. అంతే తప్ప ఎగ్జిబిటర్లకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎగ్జిబిటర్లుగా వున్న బడా నిర్మాతలు సాగనివ్వరు. ఈ ముగ్గురు ఒక మాట మీదకు రావడం కష్టం.

మల్టీ ఫ్లెక్స్ ల్లో షేరింగ్ పద్దతి వుంది. అదే పద్దతి సింగిల్ స్క్రీన్ లకు కూడా వర్తింప చేయమని ఎగ్జిబిటర్లు అడుగున్నారు. మల్టీ ప్లెక్స్ లు రేటు ఎక్కువ కనుక షేరింగ్ సమస్య కాదని, సింగిల్ స్క్రీన్ ల్లో అదే రేటు పెడితే షేరింగ్ ఇస్తామన్నది డిస్ట్రిబ్యూటర్ల మాట. కానీ అవే పెద్ద సినిమాలకు రెండు మూడు వారాల తరువాత షేరింగ్ మీద ఆడడం అన్నది కామన్. మొత్తం మీద ఈ విషయంలో కూడా నిర్మాతల మాటే చెల్లుతోంది.

ఓటిటిల్లో సినిమా విడుదల అన్నది ఎనిమిది వారాలకు కూడా వుండకూడదని, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కోరుకుంటున్నారు. కానీ సినిమా పెట్టుబడిలో ఎక్కువ భాగం ముందుగా వెనక్కు రావాలంటే నాలుగు వారాల్లో ఓటిటి ఇవ్వకతప్పదు. అందుకే నిర్మాతలు అటు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడా నిర్మాత తప్ప మిగిలిన రెండు రంగాల మాట చెల్లదు.

ప్రతి సినిమాకు టికెట్ రేటు పెంచుకోవడం కామన్ అయింది. అసలు టికెట్ రేట్లు తెస్తామని చెప్పిన తరువాత పెద్ద రేట్లకు సినిమాను అమ్ముతున్నారు. అందువల్ల తేవాల్సి వస్తుంది. టికెట్ రేట్లు పెంచినా కూడా తమకు అవే రెంట్లు ఇస్తున్నారన్నది ఎగ్జిబిటర్ల వేదన. అయినా వారి గోడు పట్టదు. ఇక్కడా నిర్మాత మాటే చెల్లుతుంది.

ఎగ్జిబిటర్లకు వేరే కష్టాలు కూడా వున్నాయి. తమ థియేటర్ కు సినిమా రావాలి అంటే ఏదో ఓ పెద్ద హ్యాండ్ తో చేతులు కలపాల్సిందే. లేదంటే పెద్ద హ్యాండ్ సిబ్బందిని బాగా చూసుకుంటూ వుండాల్సిందే. అలా కాకుండా ఎవరికి లింక్ చేయకుండా స్వంతంగా థియేటర్ నడపడం అంటే అంత వీజీ కాదు.

నిర్మాతలకు కష్టం లేదా అంటే బోలెడు వున్నాయి. ఓవర్ ఫ్లోస్ అన్నవి ఒక పట్టాన రావు. వచ్చినా కరెక్ట్ గా రావు. అందుకే ముందే కాస్త అదనంగా తీసేసుకుందాం అనుకుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు పెద్ద సినిమాలు, లైన్ లో వరుసగా సినిమాలు వున్న వారికే సాధ్యం అవుతుంది. మిగిలిన వారు అసలు లాస్ట్ మినిట్ లో అన్న అమౌంట్ లు కడతారో లేదో అని టెన్షన్ పడుతూ వుండాల్సిందే.

బయ్యర్లకు కష్టాలు వుండవా అంటే వాళ్లకూ వున్నాయి. ఎగ్జిబిటర్లు అడ్వాన్స్ ఇవ్వడం వరకు ఒకె. తరువాత ఫైనల్ ఫిగర్లు అంత త్వరగా రావు. ఎక్కువ థియేటర్లు వున్న వాళ్లు అంత త్వరగా సెటిల్ మెంట్లు చేయరు.

ఇలా ఎవరి బాధలు వారికి వున్నాయి. ఇవన్నీ టాలీవుడ్ నిర్మాతలకు, బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు తెలుసు. ఇవన్నీ ఇలా వుంటూనే వుంటాయి. ఇవి అంత సులుగా పరిష్కారం కావు. ఎందుకంటే ఒకరికి లాభం అంటే మరొకరికి నష్టం. అందుకే నిర్మాతలు కమ్ బయ్యర్లు కమ్ ఎగ్జిబిటర్లు వీటి మధ్యనే గడిపేస్తుంటారు.

3 Replies to “నిర్మాత.. బయ్యర్.. ఎగ్జిబిటర్”

  1. అందరూ అంటే విరాజమాన థ్యేయం ఒక్కటే! సీయం! సీయం! మరి ఎంతమంది హీరోలను , రాష్ట్రంలో ఒకేసారి ఎంతమందిని చేస్తారో?  దీనికి పరిష్కారం వుంది. సాధారణంగా హీరోల మువీ క్లాషవుకుండా వసూళ్లకు ఇబ్బందిలేకుండా రిలీజ్ చేసుకుంటూంటారు. అలాగే,  ఎన్నికలను తీసేసి,  ప్రతి ఒక్క హీరోనీ ఓ సంవత్సరం పాటు సీయమ్ గా రొటేషన్ పద్ధతిలో చేయాలి. అలాగా 2 రూపాయల బియ్యం, పది రూపాయలకు నూనెలు ఒక రూపాయకు ఉల్లి, అలాగా బస్సు, ఫ్రీ రైలు, ఫ్రీ విమాన, ఫ్రీ ఆటో ప్రయాణాలు ఇవ్వాలి. సినిమా టికెట్ ధర కనీసం వేయి రూపాయలు చేయాలి. 

  2. అన్నిటికి పరిష్కారం ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్. . ప్రతి షో స్టార్ట్ అయ్యిన గంటలో ప్రతి టికెట్ డాష్ బోర్డు లో కనబడితే దళారుల ఆటలు సాగవు. మల్టీ ఫ్లెక్స్ లలో అదే జరుగుతుంది. అందుకే అక్కడ పడే ప్రతి ఆట కి నిర్మాత షేరింగ్ కి ఒప్పుకున్నాడు. 

Comments are closed.