రివ్యూలు ఆపేస్తే సినిమా హిట్?

సినిమా సక్సెస్ కు షార్ట్ కట్ లు లేవు. కంటెంట్ మాత్రమే సక్సెస్ ఫార్ములా.

అసలు టాలీవుడ్ లో ఏం జరుగుతోంది. సేమ్ డే సమీక్షలు ఇవ్వకుండా వెబ్ సైట్లపై వత్తిడి తేవాలని ఒకరిద్దరు నిర్మాతలు ఎందుకు బలంగా కోరుకుంటున్నారు. పైకి ఎమీ మాట్లాడకున్నా, ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తీసే నిర్మాతలు ఏమని భావిస్తున్నారు? ఈ సంగతి డిస్కస్ చేసే ముందు కొన్ని పాత సంగతులు ముచ్చటించుకుందాం. అంటే వాట్సాప్ లు, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాలు లేని కాలంలో, సమీక్షలు అంటే ఎక్కడో, ఎవరికో తప్ప అస్సలు ఆ ముచ్చటే తెలియని కాలంలో ఫ్లాపులు ఎలా వచ్చేవి? ఫ్లాపులు అంటే మూడు రోజులు ఆడేసిన తరువాత ఫ్లాపులు కాదు. మార్నింగ్ షో కే సినిమా లేచిపోయిన వైనాలు.

విశ్వనాధ సత్యనారాయణ అద్భుతమైన నవల ఏకవీర.. దాన్ని సినిమాగా తీయాలనుకున్నారు ఎన్టీఆర్. సినారె ను పాటలతో పాటు మాటలు కూడా రాసేలా ఒప్పించారు. మహదేవన్ సంగీతం. అత్యద్భుతమైన పాటలు. ఎన్టీఆర్, కాంతారావు ఇద్దరు హీరోలు. ఇద్దరు హీరోయిన్లు. ఆ రోజుల్లో మల్టీ స్టారర్. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సినిమా విడుదలైంది. ఆ రోజుల్లో వాడే భాషలో చెప్పాలంటే మార్నింగ్ షో కే బాక్స్ లు వెనక్కు వెళ్లిపోయాయి.

అదే ఎన్టీఆర్ చరిష్మా ఉజ్వలంగా వున్న రోజుల్లో, బాలకృష్ణ అప్పుడే సినిమాలు స్టార్ట్ చేసిన కాలంలో తీసిన సినిమా అక్బర్ సలీం అనార్కలి. బాలీవుడ్ ఉద్దండ సంగీత దర్శకుడు సి. రామచంద్ర సంగీతం. అజరామరమైన పాటలు. భారీ స్టార్ కాస్ట్. సినిమా విడుదలైంది. జనం పక్కన పెట్టారు.

ఎవరు చెప్పారు. ఎవరు ప్రచారం చేసారు. చూడవద్దని ఎవరు ట్రోలింగ్ చేసారు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు వున్నాయి. ఏ వెబ్ సైట్ లు వున్నాయి?

పాటలు సూపర్ హిట్ అయిన తరువాత, కాస్త లేట్ గా వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ ఇంద్రధనస్సు, అద్భతమైన పాటలు వున్న నీరాజనం సినిమా మార్నింగ్ షో కి బకెట్ తన్నేసాయి. ఎవరు చెప్పారు అవి బాగా లేవని. కనీసం మూడు రోజులు ఆడాలి కదా.

ఇప్పుడు మన టాలీవుడ్ జనాలు చెప్పేది అదే కదా. ఎవరూ ఏమీ చెప్పకపోతే జనం మూడు రొజులు మినిమమ్ చూస్తారు. ఆ లోగా పెట్టుబడి వెనక్కు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎలాగూ రేట్లు పెంచేసి గుంజేస్తాం కదా. కానీ మరి ఆ రోజుల్లో ఎందుకు మార్నింగ్ షో కే డబ్బాలు వెనక్కు ఎలా తిరిగి వచ్చాయి. జనాలకు ఎవరు చెప్పారు? ఏ డిజిటల్ మీడియా చెప్పింది? ఏ సోషల్ మీడియా చెప్పింది?

సినిమా సక్సెస్ కు షార్ట్ కట్ లు లేవు. కంటెంట్ మాత్రమే సక్సెస్ ఫార్ములా. కాలం మారిపోతున్న రోజుల్లో ఇంకా పాత భావనలో రివ్యూలు ఆపేయాలని ప్రయత్నించేవారిది అమాయకత్వం తప్ప వేరు కాదు.

26 Replies to “రివ్యూలు ఆపేస్తే సినిమా హిట్?”

  1. ఇంత వరకు నేను రివ్యూ చూడకుండా చూసిన ఒక్క సినిమా కూడా బాగులేదు. అందరు రివ్యూ రాయండి మా బిజినెస్ కి అని అడుక్కుంటూ ఉంటే ఒక్క సినిమా వాళ్ళే విచిత్రం గా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల సంగతి తరువాత, 3 గంటల టైం ఎందుకు నేను వేస్ట్ చేసుకోవాలి?

    రివ్యూస్ బాన్ చేస్తే నేను అన్ని సినిమాలు OTT లోనే చూస్తాను.

  2. ఇంద్ర ధనుస్సు సినిమా అప్పట్లో హిట్ సినిమా, అలాంటి సినిమా ను పట్టుకొని మార్నింగ్ షో కే ఫ్లాప్ అని ఎలా రాసారు?

    1. ఆర్టికల్ లో రాసినట్లు ఏక వీర, అక్బర్ సలీమ్ అనార్కలి సినిమా లే కాక ఎన్టీఆర్ సినిమా లు ఇంకా ఉన్నాయి వారం రోజులు కష్టం మీద నడిచినవి కులగౌరవం, వేములవాడ భీమకవి లాంటి సినిమా లు 

  3. ఇంత పెద్ద పత్రిక నడుపుతూ చిన్న చిన్న లాజిక్లూ ఎలా మిస్సవుతావ్. వాల్లు చెప్పేది opinion ప్రేక్షకుడికి వదిలేయండి అని, ప్రేక్షకుడిని pre occupied opinion తో సినిమా చూసేలా చెయ్యవద్దు అని 🙏🏻🙏🏻🙏🏻🙏🏻, పరుచూరి పలుకులు లాగా సినిమా రన్ almost కంప్లీట్ అయ్యాక ఇవ్వు ఎవడు వద్దన్నాడు??/

    1. 1.ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ మొదటి షో వేసిన తరువాతే వస్తున్నాయి…..

      2.రూ 150-200 పెట్టే ముందు రివ్యూస్ చూసి నిర్ణించుకొనే హక్కు ప్రేక్షకులకు వుంటుంది.

      3.కథ, కొంచెం సభ్యత వుంటే ఆల్మోస్ట్ సినిమా గట్టెక్కినట్లె.

      4. ప్రేక్షకులకు ఇప్పుడు ఆప్షన్స్/ఛాయిస్ లు చాలా వున్నాయి….మేము చిన్నప్పుడు మా వూరిలో ఏ సినిమా వేస్తే అది మాత్రమే మాకున్ప్రపంచం….ఇప్పుడలా కాదు….

      నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటి అంటే….బిరియాని కాంబో లాగా మూవీ టికెట్స్ కూడా  కాంబో స్టైల్ లో పెట్టాలి….అంటే 1 టిక్కెట్ 150 ఐతే…..2 టికెట్స్….250, 5 టికెట్స్ కొంటే 1 టిక్కెట్ ఫ్రీ, ఇలా….కేరళ ఫైల్స్ మూవీ కి నేను 3 టికెట్స్ కొని ఇద్దరు ఫ్రెండ్స్ ను తీసుకువెళ్లా…..

      Outside ఫుడ్ allow చేస్తే ఈ నష్టాలు అన్నీ 20-30% తగ్గుతాయి.

      అయినా….

  4.  Very well said. I know about one movie of NTR titled “కాడెద్దులు ఎకరం నేల” which could complete only morning show in many areas. 

    1. 🔥 జగన్ గారు – కుటుంబ ప్రేమకు బ్రాండ్ అంబాసిడర్!

      తల్లిని కోర్టుకి లాగుతాడు, చెల్లిని పబ్లిక్‌గానే అవమానిస్తాడు…

      కానీ ఓటు మాత్రం “పిల్లల్లా చూసుకున్నా కదా!” అని అడుగుతాడు. 🤡

      ఒకప్పుడు మహిళలు “మామయ్యా!” అని పిలిచేవాళ్లు…

      ఇప్పుడు? “అయ్యో అతని పేరు వినగానే ఒళ్లు గుగ్గుమంటోంది మావ!” 😤

      📉 151 నుండి 11 సీట్లు! ఇది ఓటర్ల తీర్పా? కాదు బాస్… ఇది జనం ఇచ్చిన బ్లాక్ & వైట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు.

      ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిలు ఇప్పుడు చెప్పే డైలాగ్ ఇదే 👉

      “మామయ్య కాదు, మాయవాడు!”

      పార్టీలో ఎమ్మెల్యేలు ఎగురుతుంటే…

      జనాలు పక్కనుండి చూస్తూ ఇలా అంటున్నారు:

      “పాపం… వాడు ఇంకా సీఎం అనుకుంటున్నాడేమో!”

      ఓట్లు కోసం వంచించినవాడికి, ఎవరూ మళ్లీ ఓట్లతో ఆశీర్వాదం ఇవ్వరు.

      జగన్ గారు, ఆ డైలాగ్ గుర్తుందా?

      “ఒకసారి మోసగాడు… తప్పు అతనిది. రెండోసారి మోసపడ్డా… తప్పు మనది!”

      ఇంకా మోసపోమంటూ ప్రజల తీర్పు రాకెట్ లా పేలింది. 🚀

      👉 ఇక జగన్ కు ఓటు కాదు… ఓ చిన్న చిరునవ్వు కూడా లభించదు.

      #మామయ్య_ఫ్లాప్ #జగన్_ఊపిరితిత్తులు #తల్లి_చెల్లి_కోర్ట్ #పార్టీ_వెనక్కు #జనం_వెంట_తిరుగు #సార్_మీ_డ్రామా_ఇంకా_ఊహలే

    2. 🔥 జగన్‌కి ఇక చరిత్రలో చోటు ఉండొచ్చు… కానీ ప్రజల హృదయాల్లో స్థానం లేదు.

      తల్లి మీద కేసు వేసిన వాడు నాయకుడు కాదు.

      చెల్లిని అవమానించిన వాడు నాయకత్వానికి అర్హుడే కాదు.

      ఇతని పేరు వినగానే గ్రామాల్లోని మహిళలకు కోపం, వేదన, ఆవేశం వస్తోంది.

      ఒకప్పుడు “మామయ్య” అన్నవాళ్లే…

      ఇప్పుడు “మోసగాడు, మానవత్వం లేని వాడు” అని నిదర్శనం చూపుతున్నారు.

      ప్రజలు నమ్మారు. ఆశ పెట్టారు.

      ఆ ఆశను జగన్ తన స్వప్రయోజనాల కోసమే తుడిచేశాడు.

      ఆఖరి వరకూ నాటకం ఆడి, ఓట్లు గెలవాలన్నది ఇతని లక్ష్యం.

      📉 151 నుంచి 11 సీట్లు?

      ఇది ఓటింగ్ కాదు… ఇది ప్రజల చేతికి పట్టిన గడ్డిపోచ.

      ఇది ఎన్నిక కాదు… ఇది శిక్ష. ప్రజలెదురుగా నిలబడే అర్హత జగన్ కోల్పోయాడు.

      పార్టీ శూన్యంగా ఉంది. క్యాడర్ విరిగిపోయింది. నాయకత్వం నమ్మకాన్ని కోల్పోయింది.

      ఇంతకంటే ఘోరమైన పరిణామం ఒక నాయకుడికి ఏముంటుంది?

      👉 కుటుంబాన్ని కించపరిచిన వాడికి గౌరవం లభించదు.

      👉 జనం తట్టుకున్న పీడ గురించి మర్చిపోతే… తిరస్కారం తప్పదు.

      👉 జగన్‌కి ప్రజలు తేల్చి చెప్పిన తీర్పు: ఇంకా ఒక్క అడుగు కూడా వద్దు.

      #జగన్_ఇక_జరిగిపోయాడు

      #తల్లి_తండ్రి_గౌరవం_లేని_తలవంచే_రాజకీయాలు

      #ప్రజలు_తీసిన_చివరి_తీర్పు

      #మోసం_చేసిన_వాడికి_మరళే_లేదు

      #NeverAgainJaga

  5. సీతారామం, హనుమాన్ సినిమాలు 4 వారాల తరువాత థియేటర్ కి వెళ్లి చూశాం, రిలీజ్ కి ముందు సినిమా వాళ్ళు చేసే గిమ్మిక్కులు తో సినిమా ఏంటి అనేది రిలీజ్ కి ముందే తెలిసిపోతుంది.

    కొత్తగా రివ్యూస్ వల్ల వచ్చే లాభ నష్టాలు ఏమీ వుండవు…..

  6. Cinema lo unadi unnattu cheppi ..enduku chudavacho chepi ,evaru chudakadado chepdam manchi pane kani dabbulu teeskuni review lu rasevallu , media valani edo anarani kaksha sadimpu ga raytam matram cheyoddane ma bhavana …. 

  7. కవరు బరువు ని బట్టి రేటింగ్ ఇచ్చే వీళ్ళ లాగా కాకుండా.. సినిమా కి కూడా ఒక బిజినెస్ కి ఉన్నట్ట్లు గూగుల్ రేటింగ్ లాంటిది పబ్లిక్ కి ఉండాలి.. సినిమా చూసిన వాళ్ళూ bookmyshow లో ఇచ్చినట్లు..

    మనం ఒక రెస్టారెంట్ కి వెళ్ళే ముందు గూగుల్ రివ్యూ చూసి వెళ్ళినట్లు, ఆ పబ్లిక్ రివ్యూలు, రేటింగ్లు చూసి వెళ్ళలి అనుకునేవాడు వెళ్తాడు..

  8. Reviewer should be responsible. Some reviewers take money and write good review about a bad or ordinary movie. Some are afraid to give bad ratings to an actor turned politician’s movie when he/she is in power.  People are afraid to write good reviews about movies like “Kashmir Files”. Anyhow I read all reviews but give more weightage to some ( for example: Jeevi reviews in idlebrain.com). 

  9. మూవీ లో మంచి కంటెంట్ వుండి బాగున్నపుడు రివ్యూ ఎలా వున్న జనం చూస్తారు మూవీ హిట్ అవుతుంది. అలా కొన్ని మూవీలు హిట్ అయినవి…

  10. మీరు ఎక్కడో ఎప్పుడో వచ్చిన ఒకటి రెండు ఘోరమైన ఫ్లాప్ సినిమాల గురించిమాత్రం చెప్పవద్దు. ఏకవీర, అక్బర్..చిత్రాలు రెండూ సామాన్య ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకోకుండా తీసిన చిత్రాలు. అలా కాకుండా ఆ రోజుల్లో కొంత ఎంటర్టైన్మెంట్ ఉన్న ఎన్టీఆర్, కృష్ణ చిత్రాలు క్రమం తప్పకుండా మినిమం వసూళ్లు సాధించేవి. నిర్మాతలు మళ్ళీ మళ్ళీ చిత్రాలు తీసి నలుగురికి ఉపాధి కలిపించేవారు. రివ్యూలు ఒక వారం తర్వాత వచ్చేవి. కొన్ని లో బడ్జెట్ చిత్రాలు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీతో హిట్ అయ్యేవి. మీరు తీసిన తొలి ఆటలోనే చిత్రాన్ని చీ..ల్చి చెండాడితే ఇక థియేటర్ కి ఎవరు వస్తారు? సినిమా ఇండస్ట్రీ మూత పడితే మీరు కూడా నీరుద్యోగులవుతారని గుర్తించండి.

Comments are closed.