Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లిపై హీరో రామ్ ఫిలాసఫీ ఇది

పెళ్లిపై హీరో రామ్ ఫిలాసఫీ ఇది

హీరోలకు పెళ్లిపై ప్రశ్నలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. రానా, నితిన్, నిఖిల్ లాంటి హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేయడంతో.. మిగిలిన బ్యాచిలర్ హీరోలకు ఈ ప్రశ్నల తాకిడి ఎక్కువైంది. 

ఈ క్రమంలో ఎవరికి తోచిన ఫిలాసఫీ వాళ్లు చెప్పుకుంటూ పెళ్లి టాపిక్ ను సైడ్ చేస్తున్నారు. ఇప్పుడు రామ్ వంతు. రెడ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ కు మీడియా ముందుకు రాకతప్పలేదు. 

పెళ్లి ప్రశ్నను ఫేస్ చేయక తప్పలేదు. దీంతో పెళ్లిపై రామ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఇప్పట్లో పెళ్లి ఉండదంటూనే.. వివాహంపై వేదాంతం వల్లించాడు.

"పెళ్లి మన చేతిలో ఉండదు.. పెళ్లి తర్వాత ఏదీ మన చేతిలో ఉండదు." ఇదీ రామ్ ఫిలాసఫీ. తనకు సక్సెస్ రావడానికి టైమ్ పట్టినట్టే.. పెళ్లికి కూడా ఓ టైమ్ ఉంటుందని, ఆ టైమ్ వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా పెళ్లి జరుగుతుందన్న రామ్.. ఆ క్రమంలో పై కొటేషన్ వదిలాడు. పరోక్షంగా సోలో బ్రతుకే సూపర్ అంటున్నాడు.

ఇక పాన్ ఇండియా సినిమాపై స్పందిస్తూ.. తను కూడా ఓ పాన్-ఇండియా మూవీ కోసం ఎదురుచూస్తున్నానని.. యూనివర్సల్ అప్పీల్ ఉన్న మంచి పాయింట్ ఏదైనా దొరికితే, పాన్ ఇండియా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. 

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు

మంచి కిక్‌ ఇచ్చారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?