ఉన్నట్లుండి ఒక్కో గ్యాసిప్ పురుడు పోసుకుంటూ వుంటుంది టాలీవుడ్‌లో. అలా లేటెస్ట్ గా వినిపిస్తున్నది హీరో రామ్ కు ఆయన పెదనాన్న స్రవంతి రవికిషోర్ మధ్య బంధాలు కాస్త దెబ్బతిన్నాయన్న గ్యాసిప్.
విషయం ఏమిటంటే హీరో రామ్ కెరీర్‌కు పునాదలు వేసింది, అన్నీ తానై వుండి చూసుకున్నదీ స్రవంతి రవికిషోర్ నే. మొదటి నుంచి సినిమా రంగంలో వుండడం వల్ల, ఆయనే తన తమ్ముడి కొడుకును హీరోను చేసి, కథలు వినడం, ప్రాజెక్ట్ లు ఫైనల్ చేయడం లాంటివి అన్నీ చేస్తూ వచ్చారు.
ఇటీవల రామ్ కు సరైన హిట్ లు పడలేదు. ఇస్మార్ట్ శంకర్ తరువాత మూడు డిజాస్టర్లు చవిచూసాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ముందుకు వెనక్కు అవుతోంది. దీని వెనుక రామ్ తన రెమ్యూనిరేషన్ గురించి పట్టుదలగా వుండడం ఓ కారణం అనే గ్యాసిప్ కూడా వుంది. అది వేరే సంగతి.
ఈ నేపథ్యంలో కొందరు కథలు పట్టుకుని స్రవంతి రవికిషోర్ ను అప్రోచ్ అవుతుంటే, ఆయన నేరుగా రామ్ నే సంప్రదించమని చెబుతున్నారని తెలుస్తోంది. పైగా ఇలాంటి కథలు రామ్ చేయరు అని, ఊరమాస్ యాక్షన్ కథలే పట్టుకెళ్లమని సజెస్ట్ చేస్తున్నారనే టాక్ టాలీవుడ్ లో వుంది.
చూస్తుంటే స్రవంతి రవికిషోర్ ఇప్పుడు రామ్ వ్యవహారాలకు దూరంగా వున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయమై రామ్ పీఆర్ వర్గాలను సంప్రదిస్తే, అసలు అలాంటివి ఏమీ లేదని, రామ్.. రవికిషోర్ ఇద్దరూ తరచు కలుస్తూనే వున్నారు. అంతా బాగానే వుంది అని చెప్పారు.
ఇదిలా వుంటే రామ్ ఇటీవల బాగా డల్‌గా కనిపిస్తున్నారని, కారణం తెలియడం లేదని మరో గ్యాసిప్ చక్కర్లు కొడుతోంది. దానిని కూడా ఆ వర్గాలు ఖండించాయి. ఫుల్ జోష్ తో వున్నారని, అలాంటిది ఏమీ లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.