హీరోయిన్ శృతిహాసన్ డేటింగ్ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో శృతి డేటింగ్ చేస్తోందనేది ఓపెన్ సీక్రెట్. లాక్ డౌన్ టైమ్ లో వీళ్లిద్దరూ ఒకే ఫ్లాట్ లో గడిపారు. బాయ్ ఫ్రెండ్ బర్త్ డేను కూడా శృతిహాసన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. రీసెంట్ గా తన డేటింగ్ లైఫ్ పై ఆమె స్పందించింది.
“ఇలాంటి మేటర్స్ దాచేదాన్ని కాదు నేను. గతంలో నా డేటింగ్ వ్యవహారాల్ని దాచిపెట్టాను. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదనిపిస్తోంది. ఎందుకంటే, ఏదో ఒక టైమ్ లో నా ప్రేమ వ్యవహారాలు బయటకొస్తాయి. ప్రస్తుతానికైతే నా డేటింగ్ లైఫ్ గురించి మాట్లాడాలని లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత సీరియస్ మేటర్ కాదు.”
ప్రేమ వ్యవహారాన్ని తను దాచనని, అదే టైమ్ లో పెద్దగా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదంటోంది శృతిహాసన్. ఈ సందర్భంగా మహిళల విషయంలో హాలీవుడ్, బాలీవుడ్ మధ్య తేడాల్ని చెప్పుకొచ్చింది.
“హాలీవుడ్ లో ఓ నటికి పెళ్లయిందా లేదా ఆమె తల్లయిందా అనేది అనవసరం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ మాత్రం మహిళ విషయంలో ఇవన్నీ చూస్తారు. అదే ఓ నటుడి విషయంలో మాత్రం ఇవేవీ పట్టించుకోరు. ఈ పద్ధతి మారాలని నేను కోరుకుంటున్నాను.”
సెక్సీ మేటర్ పై కూడా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. 30ల్లో అమ్మాయిలు సెక్సీగా ఉంటారనే విషయాన్ని ఈమె ఒప్పుకోవడం లేదు. అమ్మాయిలు 15-16 ఏళ్ల వయసులో అందంగా ఉంటారని.. మళ్లీ అదే అందం, సెక్సీనెస్ 50 ఏళ్ల వయసులో తనకు కనిపిస్తుందని అంటోంది. తన విషయానికొస్తే.. 30 ఏళ్ల నుంచే తన అసలైన జీవితం మొదలైందని, నచ్చినట్టు బతకడం మొదలుపెట్టానని అంటోంది శృతిహాసన్.