‘సో..సో..గా..’ – మారుతి సినిమా పాట

డైరక్టర్ మారుతి షార్ట్ టైమ్ లో తీసిన చిన్న సినిమా 'మంచిరోజులు వచ్చాయి' నుంచి తొలి సాంగ్ వచ్చింది. 'సో..సో..గా వున్నావాణ్ణి..సో బెటరే చేసావులే' అంటూ సాగిన ఈ పాటను కేకే రాసారు. అనూప్…

డైరక్టర్ మారుతి షార్ట్ టైమ్ లో తీసిన చిన్న సినిమా 'మంచిరోజులు వచ్చాయి' నుంచి తొలి సాంగ్ వచ్చింది. 'సో..సో..గా వున్నావాణ్ణి..సో బెటరే చేసావులే' అంటూ సాగిన ఈ పాటను కేకే రాసారు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించగా సిద్దు శ్రీరామ్ ఆలపించారు. 

యువి వంశీ, విక్కీ తమ కొత్త బ్యానర్ యువి కాన్సెప్ట్ పై నిర్మించే సినిమాకు మారుతి స్వంత బ్యానర్ మాస్ మూవీ మేకర్స్ భాగస్వామి. అప్ కమింగ్ హీరో సంతోష్ శోభన్, మెహరీన్ లపై ఈ పాట చిత్రీకరించారు. 

సాహిత్యం వింటుంటే. ఆ మధ్య జాతిరత్నాలు సినిమాలో వచ్చిన చిట్టి పాట ఇన్సిపిరేషన్ ఏమో అనిపిస్తుంది. బస్తీ నుంచి బంగ్లాలోకి మారిస్తేవే…అంటూ హీరో తన లెవెల్ ఎలా మారిందో ఆ పాటలో పాడతాడు. ఇక్కడ కొన్ని లైన్లు వింటే అలాగే అనిపిస్తాయి.

మారుతికి తన ప్రతి సినిమాలో ఓ పాటను సంప్రదాయ కీర్తనల స్టయిల్ లో చేయించుకోవడం అలవాటు. ఈ చిన్న సినిమా కోసం కూడా అదే రూల్ ఫాలో అయినట్లున్నారు. అయితే మధ్యలో ట్యూన్ స్టైల్, స్పీడ్ వింటే టాక్సీవాలా కోసం సిద్దూ పాడిన సాంగ్ గుర్తుకువస్తుంది. 

మంచి రోజులు వచ్చాయి సినిమా సెప్టెంబర్ లో విడుదల అవుతుంది.