హీరోలకు స్పోక్స్ పర్సన్.. వాట్ ఏన్ ఐడియా!

తొలిసారిగా ఓ సినిమా హీరో, అదీ తెలుగు టాప్ హీరో అల్లు అర్జున్ ఓ స్పోక్స్ పర్సన్ ను నియమించుకోబోతున్నారట.

స్పోక్స్ పర్సన్- అధికార ప్రతినిధి. ఓ సంస్థ లేదా వ్యవస్థ తరపున తమ పాయింట్ లేదా సమాచారం వినిపించే వ్యక్తి. సాధారణంగా రాజకీయ పార్టీలకు వుంటారు ఇలా అధికార ప్రతినిధులు. ఎవరు పడితే వారు, ఏది పడితే అది మాట్లాడేసి సంస్థ పరువు తీయకుండా, బాగా మాట్లాడగలిగిన వారిని, మీడియాను బలంగా ఫేస్ చేయగలిగిన వారిని, సరైన మాటకారిని చూసి అధికార ప్రతినిధిగా నియమించుకుంటారు. వాళ్లనే ఇంగ్లీష్ లో స్పోక్స్ పర్సన్ అంటారు.

ఇప్పుడు తొలిసారిగా ఓ సినిమా హీరో, అదీ తెలుగు టాప్ హీరో అల్లు అర్జున్ ఓ స్పోక్స్ పర్సన్ ను నియమించుకోబోతున్నారట. ఈ విషయాన్ని బన్నీ సన్నిహితుడు బన్నీవాస్ నే చెప్పారు. అందువల్ల అనుమానం పడక్కరలేదు. అల్లు అర్జున్ లైనప్ చెప్పడం కోసం, అల్లు అర్జున్ తరపున మాట్లాడడం కోసం ఓ స్పోక్స్ పర్సన్ ను హైర్ చేస్తున్నామని అన్నారు.

అసలు ఓ హీరోకి స్పోక్స్ పర్సన్ అవసరం ఏ మేరకు వుంటుంది అన్నది అనుమానం. పీఆర్ టీమ్ ఎలాగూ వుంటుంది. వుంది కూడా. అలాగే బన్నీకి స్వంత డిజిటల్ టీమ్ కూడా వుంది. ఓ హీరో గురించి సినిమా అప్ డేట్ లు కానీ, సినిమా విశేషాల కానీ ఈ పీఆర్ టీమ్ లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వుంటాయి.

మరి ఇప్పుడు ఇక స్పోక్స్ పర్సన్ దేనికి? బన్నీ సినిమాల లైనప్ ఇదీ అని అధికారికంగా ఎవరూ చెప్పాల్సిన పని లేదు. ఏదో విధంగా ఫ్యాన్స్ తెలుసుకుంటూనే వుంటారు. టైమ్ వచ్చినపుడు అఫీషియల్ అవుతూ వుంటాయి. మరి ఇంక స్పోక్స్ పర్సన్ ఏం చెబుతారు?

ఏవైనా విషయాల మీద బన్నీ తరపున వాయిస్ వినిపిస్తూ వుంటారా? అలా వినిపించాల్సిన అవసరం వుందని బన్నీ భావిస్తున్నారా? ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ సంఘటన టైమ్ లో బన్నీ ఇమేజ్ గట్టిగా డ్యామేజ్ అయింది. అలాంటి టైమ్ లో బలమైన స్పోక్స్ పర్సన్ వుంటే బాగుంటుంది అని ఆయనకు అనిపించి వుండొచ్చు. కానీ అలా అని రెగ్యులర్ గా ఓ స్పోక్స్ పర్సన్ వుండాల్సిన అవసరం అయితే సినిమా హీరోలకు అంతగా వుండదు.

అంటే.. బన్నీ గోల్.. టార్గెట్ ఇంకేదో వుండి వుండాలి. సుదూరంగా. అది తెలియాలంటే టైమ్ పడుతుందేమో?

14 Replies to “హీరోలకు స్పోక్స్ పర్సన్.. వాట్ ఏన్ ఐడియా!”

    1. మన వెకిలి వెధవ మే మే మే భే భే భే కదా, వాడి spokessperson సజ్జల గాడి inspiration అనుకుంట sir!!

  1. సీబీ వర్క్ ఏడు, తొమ్మిది, తొమ్మిది ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.