పూజా హెగ్డేకి ఆమాత్రం తేడా తెలియదా?

ఎన్నో తమిళ సినిమాలు హిందీలో కూడా సక్సెస్ అవుతున్నాయని, తను తమిళ్ లో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీలో కూడా బాగా ఆడిందని చెప్పుకొచ్చింది.

లైఫ్ ఇచ్చిన సినిమాను ఎవరైనా మరిచిపోతారా? కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను లైట్ తీసుకుంటారా? పూజా హెగ్డే మాత్రం చాలా లైట్ తీసుకుంది. తన కెరీర్ ను నిలబెట్టిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఆమె మరిచిపోయింది.

పూజా హెగ్డే కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘అల వైకుంఠపురములో’ సినిమా. ఆమె ఫిల్మోగ్రఫీలోనే అతిపెద్ద విజయం ఇది. ఇంకా చెప్పాలంటే పూజా హెగ్డే కెరీర్ ను.. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ముందు, ఆ తర్వాత అని విడదీసి చెప్పుకోవచ్చు.

అలా తనకు లైఫ్ ఇచ్చిన ఈ సినిమాను ఆమె తమిళ సినిమాగా పేర్కొంది. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజాహెగ్డే.. ఎన్నో తమిళ సినిమాలు హిందీలో కూడా సక్సెస్ అవుతున్నాయని, తను తమిళ్ లో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీలో కూడా బాగా ఆడిందని చెప్పుకొచ్చింది.

ఈ ఒక్క స్టేట్ మెంట్ తో అల్లు అర్జున్ ఆర్మీకే కాదు, టోటల్ తెలుగు ప్రేక్షకులకు ఆమె సోషల్ మీడియాలో టార్గెట్ అయింది. ఆమె నోరు జారి మాట్లాడినా తప్పు తప్పే. లైఫ్ ఇచ్చిన సినిమా తెలుగా, తమిళా అనే విషయాన్ని కూడా మరిచిపోతే ఎలా?

ఉత్తరాది వాళ్లకు తెలుగు-తమిళ్ మధ్య తేడా అంతగా తెలియకపోవచ్చు. కానీ పూజా హెగ్డే తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. ఆమెకు ఈ రెండు భాషల మధ్య తేడా స్పష్టంగా తెలుసు. ఎంతలా అంటే, ఆమె తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంది.

తెలుగు సినిమాలతో గుర్తింపు పొంది, ఆ క్రెడిట్ ను తమిళ సినిమాకు ఆపాదిస్తున్నావంటూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా హెగ్డేపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది.

9 Replies to “పూజా హెగ్డేకి ఆమాత్రం తేడా తెలియదా?”

    1. ఉర్లగడ్డ ఉల్లిగడ్డ కి తేడ నేర్పించని ఆంటీ కి నీ పచ్చ జాతి కి నోట్లో నా మడ్ద

Comments are closed.