తాప్సీ మేడ‌మ్.. అంత వ‌ద్దేమో, ఇది చాలేమో!

న‌టి తాప్సీ మ‌రోసారి త‌న చేదు అనుభ‌వాల‌ను పంచుకున్నారు. కెరీర్ ఆరంభ ద‌శ‌లో త‌ను ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను ఆమె విశ‌దీక‌రించారు. ఒక హీరో భార్య కు త‌ను న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌న‌కో సినిమా అవ‌కాశం చేజారింద‌ని…

న‌టి తాప్సీ మ‌రోసారి త‌న చేదు అనుభ‌వాల‌ను పంచుకున్నారు. కెరీర్ ఆరంభ ద‌శ‌లో త‌ను ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను ఆమె విశ‌దీక‌రించారు. ఒక హీరో భార్య కు త‌ను న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌న‌కో సినిమా అవ‌కాశం చేజారింద‌ని అంటోంది తాప్సీ. అలాగే ఒక హీరో తో న‌టిస్తుండ‌గా.. అత‌డి గ‌త సినిమా ఫెయిల్యూర్ కావ‌డంతో ఈ సినిమా బ‌డ్జెట్ త‌గ్గింపులో భాగంగా త‌న రెమ్యూన‌రేష‌న్ ను త‌గ్గించార‌ని కూడా తాప్సీ చెప్పింది. ప్ర‌స్తుతం తాప్సీకి ఇలాంటి ఇబ్బందులు లేవు.

ఇది వ‌ర‌కే సౌత్ తో త‌ను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభ‌వాల‌ను ఆమె వివ‌రించారు. ఇప్పుడు మ‌రోసారి చెప్పారు. ఇక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉంది కానీ.. కొంత‌మంది హీరోలు త‌న‌ను తొక్కేశార‌ని తాప్సీ చెప్పిన తీరే కొంచెం ఓవ‌ర్ గా ఉంది!

అదేదో సినిమాలోన‌ట‌.. ఈమె ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ను చూసి ఆ సినిమాలో న‌టించే హీరోనే బెదిరిపోయాడ‌ట‌. ఈమెకు భారీ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ఉండ‌టం.. వ‌ల్ల త‌న ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ చిన్న‌దైపోతోంద‌ని, త‌న ఎలివేష‌న్ కు తాప్సీ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్  అడ్డు అవుతుంద‌ని ఆ హీరో భావించాడ‌ట‌. అత‌డు త‌న ప‌ర‌ప‌తిని ఉప‌యోగించి తాప్సీ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ను త‌గ్గించడ‌మో, తీసేయ‌డ‌మో చేశాడ‌ట‌! ఈ విష‌యాన్నీ తాప్సీనే చెప్పింది. ఏ మల్టీస్టార‌ర్ సినిమాలోనో న‌టించిన స్టార్ హీరో చెప్పిన‌ట్టుగా చెప్పింది తాప్సీ. 

సౌత్ లో న‌టించిన‌న్ని రోజులూ తాప్సీ స్టార్ కాలేక‌పోయింది. బాలీవుడ్ లో సినిమాల వ‌ల్ల ఆమె వెలిగింది. ఇప్పుడు స్టార్ అయ్యింది. ఇక ఏ ప‌ని చేసే వాళ్ల‌కు అయినా కెరీర్ ఆరంభంలో కొన్ని చిన్న‌చూపులు మామూలే! పెద్ద పెద్ద స్టార్లు అయిన హీరోలు కూడా త‌మ కెరీర్ ఆరంభాల్లో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాలు  ఉంటాయి. సినీరంగానికే కాదు.. ఏ రంగంలో అయినా కొత్త వాళ్ల‌ను పాత వాళ్లు ఎలా ట్రీట్ చేస్తారో అంద‌రికీ తెలిసిందే. ఈ విష‌యంలో ఆడ‌, మ‌గ తేడా ఉండ‌దు. పాత‌వాళ్ల‌కు, పాతుకుపోయిన వాళ్ల‌కు కొత్త వాళ్లు ఎవ‌రైనా చుల‌క‌నే! అది మ‌నిషి నైజం!

మ‌రి ఇలాంటి విష‌యాల్లో మ‌రీ బాధితులుగా చెప్పుకోవ‌డం గొప్ప సంగ‌తేమీ కాదేమో! ఒక స్థాయికి ఎదిగే వ‌ర‌కూ ఇలాంటి కామెంట్ల‌ను చేయ‌రు. ఒక స్థాయికి ఎదిగాకా..త‌మ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీల‌ను చెబుతూ ఉంటారు కొంత‌మంది. తాప్సీ కూడా ఆ బాప‌తేనా!