Advertisement

Advertisement


Home > Movies - Movie News

టిక్కెట్టు తెగలేదు.. బొమ్మ పడలేదు

టిక్కెట్టు తెగలేదు.. బొమ్మ పడలేదు

"లాక్ డౌన్ తర్వాత మెల్లమెల్లగా థియేటర్ల వ్యవస్థ మొదలైంది. వంద శాతం ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత థియేటర్లు ఊపందుకున్నాయి." ఈ స్టేట్ మెంట్స్ అన్నీ పైకి చెప్పుకోడానికి బాగుంటాయి. కానీ ఈ ప్రకటనలన్నీ థియేటర్లలో పడే బొమ్మపై ఆధారపడి ఉంటాయి. వారానికి ఎన్ని సినిమాలు వస్తున్నాయనేది లెక్క కాదు, అందులో ఎన్ని సినిమాలపై బజ్ ఉందనేది ఇంపార్టెంట్.

ఈ వారం ఆ తేడా స్పష్టంగా కనిపించింది. పేరుకు 10 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ దేనికీ ఓపెనింగ్స్ లేవు. హైదరాబాద్, విజయవాడలోని చాలా మల్టీప్లెక్సుల్లో మార్నింగ్ షోలకు టిక్కెట్లు తెగలేదు. దీంతో థియేటర్లన్నీ వెలవెలబోయాయి. చాలా షోలు కాన్సిల్ అయ్యాయి.

షాదీ ముబారక్, పవర్ ప్లే, ప్లే బ్యాక్, గజకేసరి, విక్రమార్కుడు, మూవీ-A.. ఇలా చాలా సినిమాలకు సంబంధించి ప్రేక్షకుల్లేక మార్నింగ్ షోలు కాన్సిల్ అయ్యాయి. ఉన్నంతలో ఏ1-ఎక్స్ ప్రెస్ సినిమాకు మాత్రమే ప్రేక్షకులు కనిపించారు. అది కూడా ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే చాలా చాలా తక్కువ.

తగినన్ని థియేటర్లు ఉన్నాయి.. కావల్సినన్ని మూవీస్ కూడా ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు కావాల్సింది ఇది కాదు. సరైన కంటెంట్ పడాలి. అంతో ఇంతో స్టార్ వాల్యూ యాడ్ అవ్వాలి. అప్పటివరకు థియేటర్లు ఇలా ఈగలు తోలుకోవడమే. 

రైతు గొప్పతనమే ఇతివృత్తంగా శ్రీకారం సినిమా

ఆర్కే నాయుడు క్యారెక్ట‌ర్ ని ఎవ‌రూ రీప్లేస్ చేయ‌లేరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?