టాలీవుడ్ కు కళ తెచ్చిన ఉప్పెన

కరోనా వచ్చి, థియేటర్లు మూత పడిన తరువాత టాలీవుడ్ జనాల్లో అనేక సందేహాలు. మళ్లీ థియేటర్లు తెరచుకుంటాయా? తెరచుకున్నా ధైర్యంగా జనం వస్తారా? వ్యాక్సీన్ రాకుండా ఫ్యామిలీలు థియేటర్ కు వస్తాయా? ఇలా రకరకాల…

కరోనా వచ్చి, థియేటర్లు మూత పడిన తరువాత టాలీవుడ్ జనాల్లో అనేక సందేహాలు. మళ్లీ థియేటర్లు తెరచుకుంటాయా? తెరచుకున్నా ధైర్యంగా జనం వస్తారా? వ్యాక్సీన్ రాకుండా ఫ్యామిలీలు థియేటర్ కు వస్తాయా? ఇలా రకరకాల అనుమానాలుు.

ఆ సందేహాలు కొంత వరకు సంక్రాంతి సినిమాలతో దూరం అయ్యాయి. అప్పటికీ ఇంకా ఫ్యామిలీలు థియేటర్ ముఖ పట్టలేదు. మాస్ జనాలే వచ్చారు. దాంతో అన్ని రకాల సినిమాలు విడుదల చేయొచ్చా, లేదా అనే మరో సందేహం. 

ఇలాంటి నేపథ్యంలో విపరీతమైన హైప్ తో ఉప్పెన సినిమా విడుదలైంది. సినిమాకు ప్రఛారం పీక్స్ లో చేసారు. ఇంటర్వూలు, ప్రెస్ మీట్ లు, ఫంక్షన్ లు ఒకటేమిటి, సోషల్ మీడియా మొత్తం ఉప్పెనే కనిపించింది.

మెగాస్టార్ దగ్గర నుంచి వీలయిన ప్రతి ఒక్కరు ఓ మాట సాయం చేసారు. జనం కాస్త సందేహపడ్డారు. మరీ ఓవర్ హైప్ చేస్తున్నారేమో? పోస్ట్ రిలీజ్ కు కొంత ప్రచారం బకాయి పెడితే బాగుండేది కదా అన్న టాక్ కూడా వినిపించింది.

కానీ ప్రచారం ఆపలేదు. మరింత రెచ్చిపోయి చేసారు. అదే ఇప్పుడు కలిసివచ్చింది. తొలిరోజు మాంచి ఓపెనింగ్ దక్కింది. ఓ కొత్త హీరో, కొత్త డైరక్టర్ కాంబినేషన్ కు ఇలాంటి ఓపెనింగ్ రావడం అన్నది చాలా రేర్.

ఈ ఫీట్ కు కారణం ఈ సినిమాకు తీసుకువచ్చిన హైప్ నే కారణం. అన్నింటి మించి సినిమాకు ఫ్యామిలీలు వస్తారు అని తెలిసింది. ఉప్పెన తొలి రోజు థియేటర్లలో ఫ్యామిలీలు కనిపించేసరికి సినిమా జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక సినిమా మండే నుంచి ఎలా వుంటుంది? నిల్చుంటుందా? నిల్చోదా? ఇలాంటి సందేహాలు వున్నాయి. వాటికి మండేనే సమాధానం తెలుస్తోంది.

తొలి రోజు కలెక్షన్లు ఇలా వున్నాయి

నైజాం…..3.08 కోట్లు
వైజాగ్….1.43
సీడెడ్….1.35
ఈస్ట్….0.98
వెస్ట్….0.81
కృష్ణ….0.62
గుంటూరు….0.65
నెల్లూరు….0.35….

పక్కవాళ్ల మీద పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటే

పోస్కోకు, సీఎం జగన్‌కు ఎలాంటి సంబంధంలేదు