సినిమా యాక్టర్లు అంటే ఫ్రీ చూసే అవకాశం వస్తే జనం మూగుతారు. అంత మాత్రం చేత ఆ జనాల తలలు లెక్క కట్టి, అన్ని టికెట్‌లు తెగుతాయి లేదా అన్ని ఓట్లు వచ్చేస్తాయి అనుకుంటే అంతకన్నా భ్రమ మరోటి వుండదు.
సినిమా విడుదలకు ముందు హీరోలు కాలేజీల చుట్టూ, షాపింగ్ మాల్స్ చుట్టూ తిరుగుతారు. జనం భయంకరంగా మూగుతారు. ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ అనుకుంటారు వాళ్లు. కానీ హీరోలు మాత్రం తమ సినిమాకు పబ్లిసిటీ అదిరిపోయింది. ఇక ఓపెనింగ్ కుమ్మేస్తుంది అనుకుంటారు.
సినిమా విడుదలయిన రోజు ముఫై శాతం ఒపెనింగ్ కూడా వుండదు. ఇది ఓ హీరో అని కాదు, చాలా మంది హీరోల పరిస్థితి. మెగా జూనియర్ హీరోల సినిమాలదీ ఇదే పరిస్థితి. గత మూడు నాలుగు సినిమాలుగా వరుణ్ తేజ్ సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్ వుండడం లేదు. అలాంటి పరిస్థితి ఆయనది. ఇప్పుడు ఆయన తన బాబాయ్ పవన్ కు ఓట్లు తెప్పించడం కోసం ప్రచారానికి దిగారు.
జనాలు ఎలాగూ మూగుతారు. ఎందుకంటే టికెట్ లేకుండా వరుణ్ తేజ్ ను చూడవచ్చు కదా. కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ల ఇష్టం. పవన్ నచ్చితే వేస్తారు లేదంటే లేదు. వరుణ్ తేజ్ చెప్పాడనో, ఆది చెప్పాడనో వేయమన్నా వేయరు. ఇదంతా టైమ్ పాస్ యవ్వారం ఓటర్లకు.