Advertisement

Advertisement


Home > Movies - Press Releases

గ్రే చిత్రం సాంగ్ విడుదల

గ్రే చిత్రం సాంగ్ విడుదల

వాలెంటైన్స్ డే మూడ్‌ను కొన‌సాగించ‌డానికి `గ్రే(GREY)` చిత్ర బృందం ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాట‌ను రిలీజ్‌ చేసింది. నాగరాజు తాళ్లూరి ఈ పాట‌ను స్వరపరిచారు. ఈ పాటను సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ రోజు ఉదయం 10.10గంటలకు విడుద‌ల చేశారు.

రాజ్ మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అద్వితీయ మూవీస్ నిర్మించింది. అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలలో నటించారు.

గ్రే అనేది బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన సినిమా అనే వాస్తవాన్ని నిజం చేసేందుకు టీమ్ అన్ని ప్రమోషన్‌ల కోసం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఎంచుకుంది. 4 దశాబ్దాల తర్వాత రూపొందుతున్న తొలి బ్లాక్ అండ్ వైట్ సినిమా గ్రే.

ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ పాట పాడిన‌ మొదటి చిత్రం ఇది. గ్రే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేక అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉన్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము అని నిర్మాత‌లు తెలిపారు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా