Advertisement

Advertisement


Home > Movies - Press Releases

గూడుపుఠాణి ట్రయిలర్ బాగుంది-మారుతి

గూడుపుఠాణి ట్రయిలర్ బాగుంది-మారుతి

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా  కె.యమ్. కుమార్ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రం "గూడుపుఠాణి ". ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ... సప్తగిరి చేస్తున్న గూడుపుటాని ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.  సప్తగిరి ప్రతి సినిమాను ఇష్టపడి చేస్తాడు తాను భవిషత్తులో చేసే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ .. తెలుగు చిత్ర రంగంలో చాలా మంది సినీ వారసులుగా ఇండస్ట్రీలో కి ఎంటర్ అయ్యారు.. కానీ ఒక మాములు వ్యక్తి ఏ బ్యా గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో హీరో స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణం. సప్తగిరికి దేవుడు ఆశీర్వాదం తో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి అన్నారు.

నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ మాట్లాడుతూ దర్శకుడు కుమార్  చెప్పిన  కథ నచ్చినపుడే మా బ్యానర్లో ఈ సినిమాకు సప్తగిరి తో  తీయాలని అనుకున్నాము. చిత్ర దర్శకుడు కొత్తవాడైనా కూడా తను ఎంచుకున్న పాయింట్ బాగుంది, హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో సినిమా తీశాము అన్నారు.

హీరో సప్తగిరి మాట్లాడుతూ... సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి  టైటిల్ తో నేను సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటివరకు థ్రిల్లర్ సినిమా చేయలేదు. ఈ సినిమాలో రఘు కుంచే గారు విలన్ గా చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. తెలుగు సినిమాకు మంచి విలన్ దొరికాడు. హాజరైన అందరికీ కృతజ్ఞతలు అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?