సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య,సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'సరసాలు చాలు'
ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా అందంగా కట్ చేశారు. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న సరసాలు చాలు చిత్రం త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ చేగూరి మాట్లాడుతూ…సరసాలు చాలు ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ. కామెడీ మరియు రొమాన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ అందరిని ఆలోచింపజేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి జంటకు కనెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్ తో ఈ చిత్రం ఉండబోతోందని తెలిపారు.