సినిమా రివ్యూ: సుబ్రమణ్యం ఫర్ సేల్

రివ్యూ: సుబ్రమణ్యం ఫర్ సేల్ రేటింగ్: 2.75/5 బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తారాగణం: సాయి ధరమ్ తేజ్, రెజీనా, అదా శర్మ, బ్రహ్మానందం, అజయ్, నాగబాబు, సుమన్, నరేష్, రావు రమేష్, ప్రభాస్…

రివ్యూ: సుబ్రమణ్యం ఫర్ సేల్
రేటింగ్: 2.75/5
బ్యానర్:
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: సాయి ధరమ్ తేజ్, రెజీనా, అదా శర్మ, బ్రహ్మానందం, అజయ్, నాగబాబు, సుమన్, నరేష్, రావు రమేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, తేజస్వి, ఝాన్సీ తదితరులు
కథనం: వేగేశ్న సతీష్, రమేష్ రెడ్డి, తోట ప్రసాద్
సంగీతం: మిక్కీ జె. మేయర్
కూర్పు: గౌతరరాజు
ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్ 
నిర్మాత: దిల్ రాజు
కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్
విడుదల తేదీ: సెప్టెంబర్ 24, 2015

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ టైటిల్లోనే ఇదేంటి అన్నది హరీష్ శంకర్ క్లియర్ పిక్చర్ ఇచ్చేశాడు. అమెరికాలో డబ్బులొచ్చే ఏ పనైనా చేసి… డాలర్లు వెనేకసుకునే కుర్రాడు (తేజ్) తప్పనిసరి పరిస్థితుల్లో ఒకమ్మాయికి (రెజీనా) భర్తగా నటిస్తాడు. ఈ లవర్‌గా నటించడం, భర్తగా నటించడమనేది తెలుగు సినిమాలకి సంబంధించి సెక్సస్‌ఫుల్ ఫార్ములా. మొగుడు కావాలి, బావగారూ బాగున్నారా, బృందావనం.. ఇలా ఈ ఫార్ములాలో సెక్సస్ అయిన సినిమాలు బాగానే ఉన్నాయి. ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం ద్వితీయార్థంలో టూమచ్ వయొలెన్స్ పెట్టిన హరీష్ శంకర్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కి ఆ మిస్టేక్ చేయలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ తనకి అతి పెద్ద స్ట్రెంగ్త్ కనుక దాని మీదే బేస్ అయ్యి ఈ చిత్రాన్ని వీలయినంత వినోదాత్మకంగా మలిచేందుకు చూశాడు. 

అయితే కథాపరంగా ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఆ మాటకొస్తే ఫార్ములా ప్రకారం సాగే కమర్షియల్ సినిమాల్లో కొత్తదనం ఎపడోకానీ కనిపించదు. సన్నివేశాల పరంగాను ఇది పలు హిట్ చిత్రాలని గుర్తు చేస్తుంటుంది. కానీ కామెడీ పరంగా తెలివైన వినోదాన్ని పండించడానికి హరీష్ పెట్టిన ఎఫర్ట్స్ వల్ల కొన్ని సన్నివేశాలు హిలేరియస్‌గా పండాయి.

ఉదాహరణకి రావు రమేష్, అజయ్ మధ్య ఫోన్ సంభాషణ.., చనిపోయే ముందు ‘సాఫ్ట్‌వేర్’ అల్లుడు కావాలంటూ కోట అడిగే సన్నివేశం, సీతతో అంత ఈజీ కాదు.. అంటూ హీరో గుడిలో పాటందుకోవడం.., ఫిష్ వెంకట్ ‘వాట్సప్’ సీన్.. ఇలా వినోదాన్ని పండించడానికి హరీష్ ప్రత్యేకమైన కృషి చేశాడు. ఈ కామెడీ సన్నివేశాల వల్ల హరీష్ ఓపెన్ చేసిన ఈ ‘సేల్’ కొంతవరకు ‘పైసా వసూల్’ అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి తెలివైన కామెడీ దృశ్యాలని అల్లుతూ వెళ్లే కథనం పకడ్బందీగా లేకపోవడం, ఫస్ట్ హాఫ్‌లోని అమెరికా తంతు చప్పగా సాగిపోవడం, సెకండ్ హాఫ్‌లో అన్ని క్యారెక్టర్లతో ఆ కొద్ది సమయంలో దేనికీ పూర్తి న్యాయం జరక్కపోవడం వంటి సమస్యల వల్ల ‘సగటు’ సుబ్రమణ్యంగా మిగిలిపోవాల్సి వస్తుంది.

ఇక క్లయిమాక్స్‌లో సుమన్, ఝాన్సీ లాంటి స్టబర్న్ క్యారెక్టర్లు చిన్న చిన్న డైలాగులతో రియలైజ్ అయినట్టు చూపించడం వల్ల డ్రామా అనుకున్నంతగా పండలేదు. ఈ ఎమోషనల్ క్లయిమాక్స్ రక్తి కట్టడానికి కావాల్సిన ప్లాంటింగ్స్ లేకపోవడం, ఆ సన్నివేశాలు చిత్రీకరించిన తీరులో పంచ్ మిస్ అవడంతో అతి కీలకమైన ఘట్టం ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. 

సీను, సీనుగా.., పార్టులు, పార్టులుగా.. కామెడీ పరంగా గిలిగింతలు ప్టెగలిగిన హరీష్ శంకర్ తన ‘సుబ్రమణ్యం’ని ఎనర్జిటిక్‌గా ప్రెజెంట్ చేయడంలోను సెక్సస్ అయ్యాడు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల మేనల్లుడు హీరో కనుక మెగాస్టార్, పవర్‌స్టార్ అభిమానులని ఆకట్టుకునేలా, వారు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యేలా కొన్ని సన్నివేశాలు డెలిబెరేట్‌గా పెట్టుకున్నారు. మేనమామల పోలికలు కూడా ఉండడం వల్ల వారిని అనుకరించాల్సిన సందర్భాల్లో సాయి ధరమ్ తేజ్ అచ్చు గుద్దేసాడు. ఒక ఎస్టాబ్లిష్డ్ కమర్షియల్ హీరోని డీల్ చేసినట్టుగానే చేసాడు తప్ప.. తేజ్‌తో అండర్ ప్లే చేయించడానికి హరీష్ శంకర్ అస్సలు ట్రై చేయలేదు. ఇంతకుముందు తనని ఎంత సీరియస్‌గా తీసుకున్నారనేది తెలీదు కానీ ‘సుబ్రమణ్యం’గా సాయి ధరమ్ తేజ్ ‘సేలబుల్ హీరో’ అనిపించేసుకుంటాడు. తన కాన్ఫిడెన్స్‌తో ‘స్టార్ మెటీరియల్’ అనే ఇంప్రెషన్ వేసే తేజ్ ఇక మీదట చేసే సినిమాల్లో మాత్రం మేనమామల రిఫరెన్సులకి.. తనకి తెలిసో, తెలీకుండానే తనపై ఉన్న వారి ప్రభావానికి దూరంగా ఉంటే సెపరేట్ ఐడెంటిటీ కూడా తెచ్చుకోగలడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో తన ఈజ్‌తో, బెరుకు లేని బాడీ లాంగ్వేజ్‌తో ఒక సాలిడ్ కమర్షియల్ హీరో కావడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయనిపిస్తాడు.  

రెజీనా ‘సీత’గా తన వంతు న్యాయం చేసింది. బ్రహ్మానందం కామెడీ ద్వితీయార్థంలో హెల్ప్ అయింది. సుమన్ క్యారెక్టర్‌పై కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి ఉంటే క్లయిమాక్స్‌కి అక్కరకొచ్చేది. అదా శర్మ సబ్ ప్లాట్‌తో ఉద్దేశించిన కామెడీ అంతగా పండలేదు. ఝాన్సీ పాత్రలో సడన్ రియలైజేషన్ ఎమోషనల్‌గా వర్కవుట్ అవలేదు. రావు రమేష్ క్యారెక్టర్ పరిచయంతోనే ఆకట్టుకున్నా ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అలరించలేదు. ఫిష్ వెంకట్‌కి రాసిన డైలాగ్స్ నవ్విస్తాయి. 

డైలాగ్ రైటర్‌గా హరీష్ శంకర్ తన సత్తా చాటుకున్నాడు. కామెడీ పంచ్‌లు పేల్చడంతో పాటు.. కొన్ని సందర్భాల్లో బరువైన భావాలని సింపుల్ డైలాగ్స్‌తో పలికించాడు. గువ్వా గోరింకతో రీమిక్స్, యాష్ కరేంగే.. పాటలు తెరపై సందడి చేస్తాయి. కొరియోగ్రఫీ అన్ని పాటల్లోను బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో అమెరికా నేపథ్యం, సెకండ్ హాఫ్‌లో భారీ తారాగణంతో నిర్మాణ పరంగా క్వాలిటీ తగ్గలేదు. లొకేషన్స్, ఆర్టిస్ట్స్ వగైరా రిస్ట్రిక్షన్స్ ఉండే అమెరికా ఎపిసోడ్‌లో హరీష్ శంకర్ మార్కు వినోదం అంతగా పండకపోయినా, ద్వితీయార్థంలో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా హరీష్ స్కోర్ చేసాడు. కథ, కథనాల పరంగా ఏమాత్రం నావెల్టీ లేకపోవడం మాత్రం లోటు. 

ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఎట్రాక్టివ్ ఆఫర్లిచ్చినా.. స్క్రిప్టు పరంగా భారీ డిస్కౌంట్స్ ఇవ్వడమే సుబ్రమణ్యం ‘సేల్’కి డిజట్వాంటేజ్. ముందే చెప్పినట్టు సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో కాలక్షేపానికి ఢోకా ఉండదు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వినోద పరంగా వెలితి అనిపించదు. ఓవరాల్‌గా పాస్ మార్కులే పొందినా కానీ మూస పోకడల వల్ల, ప్రథమార్ధం మరీ సాధారణంగా అనిపించడం వల్ల, పతాక సన్నివేశాల్లో ఎమోషన్స్ ఎఫెక్టివ్‌గా లేకపోవడం వల్ల ‘పాసబుల్ ఎంటర్‌టైనర్’ అనే మార్కుని మాత్రం దాటలేదు.

తెలుగు సినిమా నుంచి వచ్చే వాటిలో సింహ భాగం ఇలాంటి ఎంటర్‌టైనర్లే. వాటిలో సెక్సస్ అయ్యే వాటిలోను లయన్ షేర్ వాటిదే. కాలక్షేపమైతే చాలు.. కథలు, కాకరకాయలు దేనికంటే ఈ సేల్ అచ్చంగా మీ కోసమే! 

బోటమ్ లైన్: టైమ్ పాస్ వినోదం! 

గణేష్ రావూరి