చైతు సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విడుదల

ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన…

ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రిలయన్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. కాగా, యువసామ్రాట్‌ నాగచైతన్య పుట్టినరోజు నవంబర్‌ 23. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ మరియు టీజర్‌ను విడుదల చేశారు. 

Watch Chaithu – Sudheer Varma Movie Teaser

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్‌లో స్వామిరారా టెక్నీషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా విషెస్‌ తెలుపుతూ ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను విడుదల చేస్తున్నాం. నాగచైతన్య చాలా డెడికేటెడ్‌ ఆర్టిస్ట్‌. స్టైలిష్‌గా వుండే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నాగచైతన్య ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఎంజాయ్‌ చేస్తూ ఎంతో ఈజ్‌ చేస్తున్నాడు. నాగచైతన్య కెరీర్‌లో ఓ బెస్ట్‌ మూవీ అవుతుంది. ఆడియన్స్‌తోపాటు ఫ్యాన్స్‌కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. షూటింగ్‌ అంతా చాలా సరదాగా జరుగుతోంది. పాటలు తప్ప టోటల్‌గా టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అయింది. పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో ఒక థ్రిల్లింగ్‌ ఛేజ్‌ జరుగుతోంది’’ అన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.