వయసు మీదపడ్డా.. వన్నె తగ్గలేదు.!

అందాల ఐశ్వర్యం.. రోజురోజుకీ అందాన్ని పెంచుకుంటూనే వుంది. పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటించిన ఐశ్వర్యారాయ్‌, తల్లయ్యాక మాత్రం సినిమాల్ని వదులుకుంది. పూర్తిగా మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తూ, బిడ్డ సేవలో మునిగిపోయిన ఐశ్వర్య ‘బ్యాక్‌ టు…

అందాల ఐశ్వర్యం.. రోజురోజుకీ అందాన్ని పెంచుకుంటూనే వుంది. పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటించిన ఐశ్వర్యారాయ్‌, తల్లయ్యాక మాత్రం సినిమాల్ని వదులుకుంది. పూర్తిగా మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తూ, బిడ్డ సేవలో మునిగిపోయిన ఐశ్వర్య ‘బ్యాక్‌ టు యాక్షన్‌’ అనేందుకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో మెరిసింది. అందాల ఐశ్వర్యాన్ని చూసి ప్రపంచమే మరోమారు విస్తుపోయిందనడం అతిశయోక్తి కాదేమో. ఎప్పటికప్పుడు ఐష్‌ తన అందాన్ని  ఎలా పెంచుకుంటోందో తెలియక తోటి అందాల భామలు ముక్కున వేలేసుకున్నారు.  ఐష్‌ సినిమాలకు రెడీ అయిపోయిందంటూ బాలీవుడ్‌ సినీ జనం సంబరాల్లో మునిగిపోయారు.

ఇదిలా వుంటే, అభిషేక్‌తో ఐష్‌ విడాకులు తీసుకోబోతోందంటూ తెరపైకొచ్చిన ఓ గాసిప్‌ మాత్రం అటు ఐష్‌ అభిమానుల్ని, ఇటు బిగ్‌-బి అభిమానుల్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ఏదిఏమైనా.. ఐష్‌ మళ్ళీ సినిమాల్లో నటిస్తే, అందాల ఐశ్వర్యం మరోమారు ప్రేక్షకులకు కనువిందు చేస్తే.. గ్లామర్‌ ప్రపంచంలో మళ్ళీ వార్‌ వన్‌సైడ్‌ అయిపోతుందన్నది నిర్వివాదాంశం.