‘అమ్మ ఒడి’ పరిధి పెరుగుతూ ఉంది!

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ 15 వేల రూపాయలను ఖాతాలోకి జమ చేసే 'అమ్మ ఒడి'  కార్యక్రమం పరిధి క్రమక్రమంగా పెరుగుతూ ఉండటం గమనార్హం. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీ అయిన…

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ 15 వేల రూపాయలను ఖాతాలోకి జమ చేసే 'అమ్మ ఒడి'  కార్యక్రమం పరిధి క్రమక్రమంగా పెరుగుతూ ఉండటం గమనార్హం. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీ అయిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకూ విస్తరించింది. స్కూల్ కు మాత్రమే కాకుండా కాలేజీకి పిల్లలను పంపే తల్లికి కూడా ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ కాలేజ్ లకు పిల్లలను పంపేవారు ఈ పథకం ద్వారా లబ్ధిపొందే అవకాశం ఉంది. అమ్మ ఒడిని ముందుగా ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేస్తారనే మాట వినిపించింది. దానిపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. అదే మంచిదని కొందరు అన్నారు. అయితే జగన్ తప్పించుకుంటున్నారని మరికొందరు విరుచుకుపడ్డారు.

ప్రైవేట్ స్కూల్ లకు పిల్లలను పంపేవారికి కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలనే డిమాండ్ వినిపించింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆ పథకానికి అర్హులే అని జగన్ ప్రభుత్వం తేల్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఏ పాఠశాలకు పంపినా ఫర్వాలేదని పేర్కొంది.

ఈ క్రమంలో ఇంటర్మీడియట్ స్థాయి పిల్లలున్న తల్లికి కూడా జగన్ ప్రభుత్వం భరోసాను ఇస్తూ ఉంది. ప్రభుత్వ కాలేజీలకు పిల్లలను పంపే వారికి ఆ పథకం వర్తిస్తుందని విద్యాశాఖ సమీక్షలో తేల్చారు. మరి ఆరంభంలోనే జగన్ మోహన్ రెడ్డి ఇలా అదరగొడుతూ సాగుతున్నారు. చెప్పినవే గాక, చెప్పనవి కూడా చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

జగన్‌ తప్పులు చేయవచ్చు.. ఇప్పుడున్న వేవ్‌ అప్పుడుండదు