‘’… పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఙతలు తెలియ చేసుకుంటున్నాను. ఆయన అంతట ఆయన ఈ ఒక్క యజ్ఙంలో సమధ కావడానికి ఆయన అంతట ఆయన సిద్దంగా వున్నందుకు..…’’ జనసేన-తెలుగుదేశం కార్యకర్తల సమన్వయ సమావేశంలో బాలయ్య మాటలు ఇవి.
ఈ మాటలకు అర్ధం ఏమిటి? నందమూరి బాలకృష్ణ గారూ.. ఎందుకు అడుగడం అంటే, మీరు అంటే తెలుగు బాగా మాట్లాడతారు. పద్యాలు, సమాసాలు అన్నీ వచ్చి. కానీ కామన్ మాన్ వేరు కదా. అందుకే. పవన్ కళ్యాణ్ ఆయన అంతట ఆయన యజ్ఙంలో సమిధ కావడానికి రావడం అంటే ఏమిటి?
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను అని శ్రీశ్రీ అంటే అర్థం ఏమిటి? హోమం లేదా హోమాగ్ని అవిశ్రాంతంగా మండుతూ వుండడానికి తన వంతు కృషి తాను చేసానని. అంతే తప్ప శ్రీశ్రీ మరోలా… అంటే…’’ నేను సైతం ప్రపంచాగ్నిలో సమిధగా మారాను’’ అని అనలేదు.
సమధ అంటే హోమం లేదా యజ్ఙంల వేసే కర్రలు. అవి మండి బూడిదగా మారతాయి. అంటే హోమాగ్ని జ్వలించడానికి సాయం చేస్తాయి.
తెలిసి అన్నారో తెలియక అన్నారో బాలయ్య, జగన్ మీద పోరాట యజ్ఙంలో తాను సమిధ అయిపోవడానికి పవన్ కళ్యాణ్ తనంతట తాను ముందుకు వచ్చారు అని అన్నారు. దాని భావం ఎలా వున్నా, తెలుగుదేశం, ముఖ్యంగా చంద్రబాబు యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసిన వారికి అవును, నిజమే పవన్ ను జస్ట్ ఓ సమిధ మాదిరిగా వాడేస్తారు అని ఈ ప్రసంగం విన్నాక కామెంట్ చేయడం తప్పదు. జనసేన-తెలుగుదేశం సమన్వయ సమావేశంలో బాలయ్య ఇలా మాట్లాడారు. అదీ సంగతి.