ఉత్తరాంధ్రాలో అతి పెద్ద నారసింహ క్షేత్రం శ్రీ సింహాచలం అప్పన్న చందనోత్సవం ఈ నెల 23న జరగనుంది. 22 రాత్రి నుంచి దానికి సంబంధించిన సన్నాహలు మొదలవుతాయి. అర్ధరాత్రి వంశపారంపర్య ధర్మకర్త కుటుంబీకుల తొలి దర్శనంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.
ఆయన తరువాత ప్రముఖులు పెద్దలు అంతా ప్రోటోకాల్ ప్రకారం స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారు. ఇక పాలనమండలి సభ్యులు ప్రతీసారి ఉత్సవాల వేళ అతి ఉత్సాహం చూపిస్తూంటారు. ఈ ఉత్సవాలలో బోర్డ్ సభ్యులు అతి చేస్తారని, టికెట్ల అమ్ముకోవడాలు, దర్శనాల విషయంలో అధిక జోక్యాలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతున్నాయని ఫిర్యాదులు విమర్శలు ఎప్పుడూ వస్తూంటాయి.
దీంతో వైసీపీ పార్టీగా ప్రభుత్వంగా ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ మల్లికార్జున స్వయంగా అన్నీ పర్యవేక్షిస్తున్నారు. సామాన్య భక్తుడే తొలి ప్రాధాన్యత అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బోర్డు మెంబర్స్ అతి జోక్యం ఈసారి లేకుండా వైసీపీ పార్టీ పెద్దలు కట్టడి చేశారని తెలుస్తోంది.
మీ వరకే దర్శనాలు చేసుకుని రండి, పైరవీలు చేయవద్దు అంటూ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తమ పార్టీకే చెందిన బోర్డు మెంబర్స్ కి ఇప్పటికే గట్టిగా కాషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఎవరైనా దాటి వ్యవహరిస్తే వారి బోర్డ్ మెంబర్ షిప్ కట్ అవుతుందని కూడా హెచ్చరించారని అంటున్నారు. దాంతో బోర్డ్ మెంబర్స్ తోక ముడిచేశారు అని అంటున్నారు.
సామాన్య భక్తుడిలకే పెద్ద పీట వేయడానికి ప్రభుత్వం చూడడం, బోర్డు మెంబర్స్ అతి జోక్యాన్ని నివారించే ప్రయత్నాలు లు చేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. సజావుగా స్వామి వారి చందనోత్సవం జరిగితే ఇది కచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని అంటున్నారు.