పార్టీ నాయకులపై ఇంకా జగన్ లో చులకన భావమేనా?

జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయాన్ని ఒప్పుకుంటారా.. లేదా 11 సీట్లు దక్కడం కూడా కేవలం దేవుడు ఆశీర్వాద బలమే అంటారా?

జగన్మోహన్ రెడ్డికి తన సొంత పార్టీ నాయకులు అంటే చులకన భావం ఉందా? పార్టీ వ్యవస్థలో స్తంభాల వంటి నాయకులపై ఆయనకు విశ్వాసం లేదా? అనే అనుమానం పార్టీలోనే కొందరిలో ఉంటుంది.

జగన్ తాజా మాటలు గమనిస్తే ఈ విషయం నిజమే అని అనుకోవాల్సి వస్తోంది. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి నిష్క్రమణం గురించి విలేకరులు అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. విజయసాయిరెడ్డి కావచ్చు, మిగిలిన వారు కావచ్చు ప్రలోభాలకు లొంగి, భయపడి రాజీపడి, పార్టీని వీడిపోతే వారి వ్యక్తిత్వం, విలువ విశ్వసనీయత ఏమిటి? వారే కాకుండా ఇంకా ఒకరిద్దరూ వెళ్లిపోయినా సరే అంతే.. అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ‘వైసీపీ ఇవాళ ఉన్నది అంటే.. అలాంటి వారి వల్ల కాదు, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మాత్రమే ఉంది’ అని జగన్ అంటున్నారు!

దేవుడి దయ అని ఆయన నమ్మడం ఓకే. కానీ పార్టీ నిర్మాణంలో స్తంభాల వంటి నాయకులు చాలా కీలకం కదా అనేది పలువురి వాదన. జగన్ స్వయంగా పార్టీ కార్యకర్తలు నాయకులలో ఉండే నైతిక స్థైర్యాన్ని, తన ఐదేళ్ల పరిపాలన కాలంలో దెబ్బతీశారు అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. నాయకులు ఎవ్వరికీ విలువ ఇవ్వకుండా.. ప్రజల్లో కూడా వారికి విలువ లేకుండా చేశారని.. అనుకుంటున్నారు.

వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకు డబ్బు పంచే ప్రతి ప్రభుత్వ పథకం ఆటోమేటిగ్గా వారి ఖాతాల్లో పడడం లేదా వాలంటీర్ల ద్వారా మాత్రమే జరిగింది తప్ప పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. ఇదంతా కూడా పార్టీ వ్యవస్థాగత నిర్మాణానికి విలువ లేకుండా చేసింది.

ఎంతగా దేవుడి దయ వలన పార్టీ మనగలుగుతున్నదని అనుకున్నప్పటికీ.. పార్టీ వ్యవస్థ మొత్తం నీరసించిపోవడం.. గత ఎన్నికలలో తీవ్రమైన పరాభవానికి కారణం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయాన్ని ఒప్పుకుంటారా.. లేదా 11 సీట్లు దక్కడం కూడా కేవలం దేవుడు ఆశీర్వాద బలమే అంటారా? ప్రజల ఆశీస్సులు తాను 11 సీట్లలో ప్రాతినిధ్యం వహించాలని మాత్రమే ఉన్నదంటారా?; అదే తరహా మాటలతో ఇప్పటికీ రోజులు గడిపేయాలని చూస్తుంటారా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది.

19 Replies to “పార్టీ నాయకులపై ఇంకా జగన్ లో చులకన భావమేనా?”

  1. యా లీడర్ పోయాడబ్బా??సాయన్న అసలు లీడరే కాదు.

    పోతే పోనీ ఏమైతాది, ఈసంటి అసమర్తుడు పోతే పార్టీ కి మంచిదే.

    సంసారాల్లో అశాంతి లేపుతూ, ఈ వయసులో శాంతితో పిల్లలని కంటున్నాడు కానీ పట్టుమని 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని అసమర్తుడు. వాడు పోతే ఇంకో వంద మంది ని తయారు చేద్దాం అన్నాడని టాక్..

  2. వాడు 2.0 అని చెప్పుడు.. దాన్ని వైసీపీ సోషల్ మీడియా జనాల మీద రుద్దుడు..

    1.0 అసలేముందని 2.0 తెస్తున్నారు..? 1.0 అట్టర్ ప్లాప్.. అదొకటుందని కూడా జనాలు మర్చిపోయారు..

    ..

    వాడికి అర్జెంటు గా సింపతీ తెచ్చే కార్యక్రమం ఒకటి కావాలి.. కూటమి ప్రభుత్వం వీడిని పట్టించుకోవడం లేదు..

    కనీసం జైలు లో వేస్తే.. మళ్ళీ వస్తా .. సీఎం అవుతా అని కలలు కంటున్నాడు..

    పోనీ.. బాబాయ్ లాగా ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తున్నాడు..

    చివరికి జగన్ రెడ్డి లండన్ వెళ్లిన టైం చూసుకుని.. విజయ సాయి రెడ్డి కూడా జంప్..

    ..

    చిరంజీవి పార్టీ పెట్టిన టైం లో కూడా పార్టీ మారని ఉదయభాను లాంటి వాళ్ళు కూడా జనసేన లోకి జంప్..

    2027 కి ఎన్నికలు వచ్చేస్తాయి అంటున్నాడు.. అప్పుడు సజ్జల రెడ్డి కి, వాడి కొడుక్కి టిక్కెట్లు ఇచ్చుకొంటాడు..

    ..

    కొండెర్రిపప్ప.. ఫస్ట్ నాయకులను తయారు చేసుకోవాలి.. క్షేత్ర స్థాయిలో పోరాడాలి.

    ప్రతి వారం వస్తాడు.. స్క్రిప్ట్ చదువుతాడు.. బెంగుళూరు పోయి బజ్జుని నిద్ర పోతాడు..

    1. క్షేత్ర స్థాయిలో పోరాటం ఎందుకు??

      5 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుంటే అధికారం తన్నుకుంటూ అదే వస్తుందని చెప్పాడు కదా.

      అందుకే డిస్టర్బన్స్ లేకుండా, బజ్జుని నిద్రపోవడానికే బెంగళూరు ప్యాలెస్ కి పోతున్నాడు.. ఈ దెబ్బతో

      2.0 నే కాదు 11.0 కూడా

    2. మా అన్నయ్య బొమ్మ తోనే 175 చోట్లా ఓట్లు పడ్డాయి వచ్చే ఎన్నికల్లో కూడా ఓట్లు పడ్తాయి: తింగరి గొర్రెలు

  3. ‘YSRCP నడుస్తోంది 5 కోళ్ల తో ..ఇప్పుడు “S” అంటే సాయిరెడ్డి పోయాడు

    ఇక “R” కి పొగ పెట్టారు.. రేపో మాపో out అయ్యేలా ఉంది.

    ఇక Y సుబ్బిగాడు, C చెవి, P పెద్ది మాత్రమే మిగిలే ఛాన్స్

    YSRCP లో YCP మాత్రమే ఉంటుంది.

  4. ‘YSRCP అనే మంచానికి 5 కోళ్లలో..ఇప్పుడు “S” అంటే సాయిరెడ్డి పోయాడు

    ఇక “R” కి పొగ పెట్టారు.. రేపో మాపో out అయ్యేలా ఉంది.

    ఇక Y సుబ్బిగాడు, C చెవి, P పెద్ది చెడ్డీస్ మాత్రమే మిగిలి

    YSRCP పోయి YCP అవుతుంది.

  5. ‘YSRCP అనే మ0చానికి 5 కోళ్లలో..ఇప్పుడు “S” అంటే సాయిరెడ్డి ‘పోయాడు

    ఇక “R” కి పొగ పెట్టారు.. రేపో మాపో ‘out అయ్యేలా ఉంది.

    ఇక Yv ‘సుబ్బిగాడు, C చెవి, P పెద్ది ‘చెడ్డీస్ మాత్రమే మిగిలి

    ‘YSRCP పోయి ‘YCP అవుతుంది.

    It will be no more ‘YSR Party..

  6. తన ఐదేళ్ళ పాలనతో చంద్రబాబే మెరుగు అనిపించాడు. ఇప్పుడు లోకేష్, పవన్ కళ్యాణ్ లే బెటర్ అనిపిస్తున్నాడు. ఉత్త పనికి మాలినోడు

Comments are closed.