అమెరికా నుంచి అక్రమ వలసదారుల్లో మొదటి బ్యాచ్ ఇండియాకి వచ్చేసారు. వాళ్లకి కాళ్లకి, చేతులకి సంకెళ్లేసి మరీ పంపించారు. ఇంతకీ వచ్చిందెంతమంది? 104 మంది ఒక విమానంలో అమృత్సర్ కి, మరో 104 మంది మరొక విమానంలో అహ్మదాబాదుకి.
అమెరికాలో ఉన్నారంటున్న అక్రమ భారతీయ వలసదారులు ఎంతమంది? ఒక లెక్క 7,25,000 అని చెపుతున్నా ఇమిగ్రేషన్ అండ్ కస్టంస్ ఎంఫోర్స్మెంట్ వాళ్లు చెబుతున్న లెక్క 18,000 మంది. ఈ లెక్కన ఆ 18,000 మంది రావాలంటే ఎన్నాళ్లు పడుతుంది? ఒకవేళ లెక్క 7,25,000 నిజమైతే వాళ్లు రావడానికి ఎన్నేళ్లు పడుతుంది? విమానానికి 100 మంది చొప్పున అంటే ఎప్పటికి తెవలాలి?
వారానికొక అమెరికా మిలిటరీ విమానం ఇండియాలో దిగినా 18,000 మందిని దింపడానికి 180 వారాలు..అంటే దాదాపు నాలుగేళ్లు పడుతుంది. అప్పటికి ట్రంప్ పదవీ కాలం కూడా పూర్తవుతుంది. ఇక లెక్క 7,25,000 అనుకుంటే 140 ఏళ్లు పడుతుంది. అసలది అయ్యే పనేనా? పోనీ స్పీడ్ పెంచినా అంతమందిని శాశ్వతంగా ఇండియాలో దింపడం సాధ్యమయ్యే పని కాదు. పైగా విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు 7 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే వార్షిక అమెరికా బడ్జెట్లో గణనీయమైన శాతం ఈ తరలింపులకే పెట్టుకోవాలి.
అందుకే ఇదంతా గమనించి ట్రంప్ డిపోర్టేషన్ పర్వానికి అందరూ గురికారని, చాలా మంది లక్కీ ఫెలోస్ అక్కడే ఉండిపోతారని అంటున్నారు.
ఇంతకీ ఎవరు లక్కీ, ఎవరు అన్ లక్కీ, అసలు ఎవర్ని ముందుగా తోలేస్తారు, ఎవరు నెమ్మదిగా వస్తారు..అనేవి చెప్పుకుందాం.
ఈ రోజు ఇండియాలో దిగిన అక్రమ వలసదారుల్లో అధిక శాతం మంది గత రెండు నెలల్లో మెక్సికో గోడ దూకుతుండగా దొరికిపోయిన వాళ్లు. వారిలో మరీ ముఖ్యంగా ఒకతను నేటికి పన్నెండు రోజుల క్రితం డంకీ మార్గంలో పనామా, నికరాగువా, మెక్సికో దాటి సరిగ్గా అమెరికా గోడ దూకగానే దొరికిపోయిన వ్యక్తి. అతనిని పదకొండు రోజులు జైల్లో ఉంచి, పన్నెండో రోజు మిలిటరీ విమానం ఎక్కించి అమృత్సర్లో దింపేసారు.
ఇన్నిసార్లు వీళ్లని “అక్రమ” వలసదారులు అంటుంటే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ల కథ వింటే అయ్యో అనిపిస్తుంది తప్ప కోపం రాదు. భారతీయులకనే కాదు, ప్రపంచంలో ఎవరు వాళ్ల గాధలు విన్నా, వాళ్ల అమాయకత్వానికి సానుభూతే చూపిస్తారు.
హర్వీందర్ సింగ్ అనే 42 ఏళ్ల వ్యక్తిది పెద్ద కుటుంబం. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అప్పులు, బాధ్యతలు ఇలా అనేకం ఉన్నాయి. అయినా సరే, అవన్నీ పెద్దగా పట్టించుకోకుండా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. అప్పుడే ఒక దూరపు బంధువు ద్ర్వారా ఒకతను పరిచయమయ్యాడు.
“ఇక్కడుంటే భవిష్యత్తు ఏముంటుంది? అమెరికా వెళ్తే అద్భుతంగా ఉంటుంది…నేను వాళ్లని పంపాను, వీళ్లని పంపాను” అంటూ కబుర్లు చెప్పాడు. నలభై లక్షలు ఖర్చు పెడితే ఆరేడు నెలల్లో ఆ ఖర్చు వెనక్కి వచ్చేస్తుందని, ఆ తర్వాత అంతా సంపాదనే అని నమ్మబలికాడు. ఎప్పుడో ఎవరో అలా ఇల్లీగల్ గా వెళ్లిన వాళ్లకి నెమ్మదిగా గ్రీన్ కార్డ్ వచ్చిందని ..ఇలా ఏవేవో కథలు చెప్పాడు. హర్వీందర్ బుట్టలో పడ్డాడు.
ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి నలభై లక్షలు సమర్పించుకున్నాడు. నేటికి 8 నెలల క్రితం డంకీ మార్గం ద్వారా నానా కష్టాలూ పడి అమెరికా చేరాడు. ఆ మార్గంలో అన్ని కష్టాలుంటాయని అతనికి ముందు తెలీదు, ఆ బ్రోకర్ చెప్పలేదు. నాలుగైదు రోజులు అడవుల్లో బతికాడు. తిండి, తిప్పలు లేవు. కొండలు, గుట్టలు, లోయలు అన్నీ ఎక్కి దిగాడు. తాను ఎంచుకున్న మార్గం ఎంత తప్పో అర్ధమయింది. కానీ ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కి రాలేని పరిస్థితి. చివరిగా అమెరికా చేరాడు అక్రమంగా. పోలీసులకి దొరికిపోయాడు, ఈ రోజు అమృత్సర్ లో దిగిపోయాడు.
ఇంచుమించు అందరివీ ఇలాంటి కథలే. ప్రశాంతంగా ఉన్నవాళ్ల మనసుల్లో ఏవో ఆశలు పుట్టించి డబ్బు లాక్కుని అమెరికా పంపే దళారీలే అసలు సిసలు క్రిమినల్స్. అంతే కానీ వీళ్లు కాదు. వీళ్లంతా బాధితులు తప్ప, నేరస్థులు కాదు. ముందు ఆ బ్రోకర్ గాళ్లని లోపలేయాలి. అదే పని చెయ్యాలని విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఈ రోజు పార్లమెంటులో అన్నారు. అమెరికా అక్రమ వలసదారుల్ని సంకెళ్లేసి పంపిస్తే, వాళ్లకి ఆ గతి పట్టించిన ఇండియన్ బ్రోకర్లని ఏం చేయాలో అది చేయాలి. దీని మీద అవగాహనా సదస్సులు, వీడియోలు విస్తృతమవ్వాలి.
అమెరికా ప్రస్తుతం తాజా అక్రమ వలసదారుల్ని వెనక్కి తోలేసే పని పెట్టుకుంది. నెమ్మదిగా మిగిలిన వాళ్ల మీద పడుతుంది. ఎవరా మిగిలినవాళ్లు అంటే..ఎప్పుడో అక్రమంగా వెళ్లి అక్కడ స్థిరపడిపోయి జనంతో మమేకమైపోయిన వాళ్లు, లీగల్ మార్గంలో ఏ టూరిస్ట్ వీసా మీదో, స్టడీ వీసా మీదో వెళ్లి ఆ వీసా గడుపు పూర్తైపోయినా ఏళ్ల తరబడి అక్కడ అక్రమంగా బతికేస్తున్నవాళ్లు..! ముఖ్యంగా ఈ రెండు కేటగరీలే కనిపిస్తాయి. అయితే కొందరు ఫేక్ గ్రీన్ కార్డ్ మీద ఉంటున్నవాళ్లున్నారు. ప్రస్తుతానికి ఐడీ చూపమన్నప్పుడు గ్రీన్ కార్డ్ తీసి చూపిస్తే వదిలేస్తున్నారు. అసలది రియలో, ఫేకో నిర్ధారణ చేసుకుంటే అదింకా పెద్ద నేరం. ఐడెంటిటీ లేకుండా ఉన్నందుకే సంకెళ్లేసి డిపోర్ట్ చేస్తే, ఫేక్ ఐడెంటిటీతో ఉన్నవాడిని, అది ఇచ్చినవాడిని గిట్మో ప్రిజన్ కి పంపినా ఆశ్చర్యముండదు.
ఇదిలా ఉంటే తాజాగా అమెరికాలో చాలా ఇండియన్ రెస్టారెంట్లు మూతపడేలా ఉన్నాయి. కొత్తగా తెరవడానికి సిద్ధంగా ఉన్నవి ఆగాయి. కారణం పనిచేయడానికి మనుషులు దొరక్కపోవడం. లీగల్ గా వర్కర్స్ ని తీసుకోవాలంటే కేలిఫోర్నియాలాంటి చోట గంటకి 20 డాలర్లు పే చెయ్యాలి. అదే ఇల్లీగల్ వర్కర్స్ అయితే 8 కి, పదికి పని చేస్తారు. ప్రస్తుతానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ డిపోర్టేషన్ భయంతో బయటికి రాకుండా ఉన్నారు. ఈ పరిస్థితి ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.
హెచ్ 1 బి లాంటి టెక్ వీసాలు ఇచ్చినట్టు, బ్లూ కాలర్ జాబ్స్ కి కూడా వీసా ప్రవేశపెడతాడా ట్రంప్? అప్పుడు రాజమార్గంలోనే ఇండియా నుంచి ప్లంబర్లు, బార్బర్లు, కార్పెంటర్లు అనేకమంది వెళ్లొచ్చు..ఆ దేశానికి అవసరమనుకుంటే. లేదా “అమెరికా ఫస్ట్” నినాదంతో లోకల్ పీపుల్ కే ఆ ఉద్యోగాలివ్వాలని, కావాల్సినంత మంది అక్కడున్నారని అంటే.. ఓకే. ట్రంప్ ఈ విషయంపై ఆలోచిస్తాడేమో చూడాలి.
ప్రస్తుతానికి, అక్రమవలసదారులు ఎంతమంది ఉన్నా పంపించేయాల్సిందే అనుకుంటే మాత్రం విమానాల్లో కాకుండా వారానికి 10-15 ఓడల్లో, ఓడకి 3000 మంది చొప్పున పంపిస్తే త్వరగా టార్గెట్ రీచ్ అవ్వొచ్చు. వాళ్ల సంగతి ఎలా ఉన్నా జయశంకర్ చెప్పినట్టు ఇలీగల్ ఇమిగ్రేషన్స్ చేసే బ్రోకర్స్ పై సత్వరమే ఉక్కుపాదం మోపాలి. అలాగే అమెరికా కూడా ఫేక్ గ్రీన్ కార్డ్స్ అందించే ముఠాలపై కన్నెర్ర చేయాలి.
పద్మజ అవిర్నేని
If they contract it out commercial planes such as Air India, they will dump them all in 1 week.
How did these many people leave the country illegally? What was Central government doing when over 1L people were leaving country illegally?
They are not leaving illegally! They are staying in USA illegally!!
If they went there legally, government should have data which they should use to find out people that are staying illegally and must share with US government to have them deported instead of waiting for US to insult Indian citizens.
Shouldn’t protecting Indian citizens across the world be the responsibility of Indian government? Instead, government has only been caring about the dollars that these illegal residents are sending to India.
Evaru pommannaru asalu vallani?
Joblessness in India.
Emito papam 5k volunteer jobs evvaleka poindi cg
yeah not all states have 5k volunteer jobs ..
Yes, not all states have fooled people with super cheating schemes.
మీరు చెప్పిన ప్రకారం, విదేశాల్లో వున్న ప్రతి ఇండియన్ , తమ వీసా వివరాలు , తమ వూళ్లో నీ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి అంతేగా?
అప్పుడు మన పోలీసు లు మీ వీసా ఎక్సపీరి దాటితే , ఆ దేశం వచ్చి మమ్ములను ఇండియా కి తిరిగి తీసుకువస్తాడు. ఇదేనా మీరు కోరుకుంటున్నారు?
When they leave India, they legally leave as a tourist to south American countries. Our government cannot filter them
అంటే మీరు పెపంచమ్ లో ఎక్కడ ఉన్నారో,మీ సొంత వూళ్లో పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గమనిస్తూ వుండాలి ఆన్న మాట.
మీ విదేశీ వీసా స్టేటస్ నీ వూళ్లో పోలీస్ రోజు చెక్ స్టేస్తు, వేరే దేశం లో మీ వీసా పూర్తి కాగానే, మీ ఇంట్లో కి వెళ్లి ఇంకా మీరు ఏందుకు తిరిగి రాలేదు అని కేసు పెట్టాలి, ఇదేనా ,మీరు కోరుకుంటున్నారు
Punjab do not have 5k Volunteer Jobs! thats they are leaving???
We need to watch out for AP as super six implementation will drive more people towards this route.
No need nava randralu lead people to sit at home and eat …with out work
If you do not need them, ave nava randraalu mydukoni kurchondi. Who are you to speak about others? If not needed, why were promises made?
They will go do not worry. Your fav anna kept saying babu will not full fill promises, still people voted for them (-40 % ). Governance means not padhakalu and musti hamilu grow up.
Talk about what CBN said and the manifesto he relased with super six schemes. People believed fake propaganda and are now realizing their mistake. Will not repeat the mistake again even if Megadtar himself asks for votes this time.
Mari election campaign lo enduku hepparraerrippooka
The taxes that my family pays in AP is for roads, infra and jobs. Not for distributing freebies to ppl who keep having kids they can’t afford.
The taxes I pay are for roads, infra, clean surroundings and jobs. Not for freebies to ppl who are irresponsible enough to marry and have kids they can’t afford and become a burden to tax payers.
He is born to group of dads at Kammaravati
volunteers meeda padi yedchaaru gaa
kukkaallaaraaa
Hi
ఇంతకీ గ్యాస్ వెంకీ deport ఎప్పుడు అవుతున్నాడు??
Shutup langa gaa . Koodi nayee
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, vc
Ashaa
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది
Venkee ninnu yeppudu dhinchuthunnaru.
Treating Indian students in this manner is unacceptable.
Our central government ought to impose some consequences on the United States.
Jai Hind
Shutup mad dog. Don’t you know they were illegally entered in other country? Mind less fellow
తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది nud cal
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు,
Why students go for studies in U.S? Are out universities not offering such courses? No one wants to reply straight. Because all know that Student visa provides shelter to gain some hold on USA soil. Students leave to USA to settle in the guise of studies. All know this truth which is called Dollar Dreams. Many have cheated dear ones to settle abroad. They gratify their lady luck.Trump can use Ship to send illegal immigrants at far away islands.. Then??
Someone was talking about taxes that they pay shouldn’t be used for freebies. My answer to them is to find a place where welfare schemes are not given and pay your taxes to that state or country. What I need is a place where people are not cheated with fake promises by politicians. I will choose the side to vote based on the promises made and it is the duty of the government to fulfill each and every promise that was made.
My question to all the people who are barking now about taxes money going to welfare schemes, what were you doing whrn tall promises in the name of super six were being made? You showed purposeful blindness when the promises were made and these showoff intellects are talking against the promises being made. Stop doing these dramas as you can only survive until 2029 with such tactics.
తానా బ్యాచ్ మొత్తాన్ని తన్ని తరిమేయాలి ట్రంప్ మాయ
పద్దూ అక్క,మన షిప్ నే అద్దెకి ఇద్దమా?
అమెరికాలో వాళ్ళని ఇండియా కి పంపడం అంటే ఎందుకో మొదట నుండి గ్రేట్ ఆంధ్ర పద్దూ అక్కయ్య కి చాలా సరదా.
మొదట్లో అమెరికా కి రావొద్దు అని వరస బెట్టి రాసేవాళ్ళు.
చూస్తుంటే, మన తెలుగు స్టూడెంట్ వివరాలు గ్రేట్ ఆంధ్ర నే నేరుగా ట్రంప్ కి ఈమెయిల్ చేసేటట్లు వున్నారు .
యెందుకు అక్కాయీ, మన సొంత వాళ్ళు అమెరికా లో వింటే మీకు అంట అసూయ?
మీరు షాపు కి వెళ్ళినప్పుడు మీ ముందు క్యూ లో తెలుగు స్టూడెంట్ మిమ్ములను ముందు వెళ్ళనివ్వలేదు అని కచ్చ నా?