ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రేస్‌లో వైసీపీ కార్మిక సంఘం నాయకుడు గౌతమ్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైఎస్ కుటుంబంతో బంధుత్వం కూడా కలిగిన గౌతమ్‌రెడ్డినే బరిలో దించొచ్చని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఒకప్పుడు వామపక్షాల ఉద్యమాల్లో క్రియాశీలకంగా గౌతమ్‌రెడ్డి పని చేశారు. అనంతరం ఆయన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తున్నారు. ఒకసారి వంగవీటి రంగాపై అభ్యంతరకర కామెంట్స్ చేశారనే కారణంతో కొంత కాలం గౌతమ్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. లాయర్‌గా కూడా ఆయన గుర్తింపు పొందారు.
గౌతమ్‌రెడ్డి అయితేనే గట్టి పోటీ ఇవ్వొచ్చని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ప్రత్యర్థులకు భయపడకుండా ఎదురొడ్డి నిలబడే నాయకుడిగా గౌతమ్‌రెడ్డికి పార్టీలో ఎక్కువ మంది మద్దతు లభిస్తోంది. వైసీపీ కార్మిక సంఘం నాయకుడిగా అన్ని వర్గాల్లో గౌతమ్‌రెడ్డికి పలుకుబడి ఉన్నట్టు అధిష్టానం భావిస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరు ఖరారైంది. వివిధ కారణాల రీత్యా కూటమిపై గ్రాడ్యుయేట్లలో వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా విజయవాడను వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉండడం, అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదనే ప్రచారం జరుగుతుండడం, ఇతరత్రా అంశాలు కూటమికి నెగెటివ్ అవుతాయని వైసీపీ నమ్ముతోంది. వచ్చే ఏడాదిలో మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపు ఇంకా ఎన్నెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.
vc available 9380537747
వైసీపీ లో రాత్రికి నాలుగు గోడల మధ్య బైబిల్ చదివి బయటకొచ్చి బొట్టు పెట్టుకుని హిందువులని మోసం చేసే రెడ్లు కాకుండా వేరే ఎవరు దొరకలేదా ?
Call boy jobs available 9989793850
“ ముఖ్యంగా విజయవాడను వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉండడం, అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదనే ప్రచారం జరుగుతుండడం, ఇతరత్రా అంశాలు కూటమికి నెగెటివ్ అవుతాయని వైసీపీx నమ్ముతోంది”
వరద సమయంలో కోటి రూపాయలకు సరిపడా మజ్జిగ packets, చలివేంద్రాల ఏర్పాటు చేసిన వారికి నిరుద్యోగులు పట్టం కట్టబోతున్నారా? అదీ పట్టభద్రుల మ్మెల్సీ ల్లో. రాత్రి ఏదైనా పిచ్చి కుక్కను కరిచి వచ్చి ఇది వ్రాసినట్లున్నాడు.