ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోని టీడీపీ!

ఉప ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్టు తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుప‌తిలో జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. ప్రాయ‌శ్చిత్త దీక్ష విర‌మణ‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుమ‌ల‌కు…

ఉప ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్టు తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుప‌తిలో జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. ప్రాయ‌శ్చిత్త దీక్ష విర‌మణ‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుమ‌ల‌కు వ‌స్తాన‌ని ముందే ప్ర‌క‌టించారు. అనంత‌రం తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ కూడా ప్లాన్ చేశారు. అయితే ఎక్క‌డా కూడా టీడీపీని క‌లుపుకునే ప్ర‌య‌త్నం స్థానిక జ‌న‌సేన నాయ‌కులు చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ ఏర్పాట్లు, అలాగే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేయ‌డానికి ఏర్పాటు చేసిన స‌న్నాహ‌క స‌మావేశానికి టీడీపీ నేత‌ల్ని పిల‌వ‌లేదు. దీంతో మ‌న‌కెందుకులే అని టీడీపీ నాయ‌కులు కూడా దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా తిరుమ‌ల‌కు ప‌వ‌న్ చేరుకున్నారు. తిరుప‌తి టీడీపీ నాయ‌కులెవ‌రూ ఆయ‌న్ను క‌ల‌వ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తి నుంచి జ‌న‌సేన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆర‌ణి శ్రీ‌నివాసులుకు తిరుప‌తి జ‌న‌సేన టికెట్ ఇవ్వ‌డాన్ని ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభ్య‌ర్థిని మార్చేది లేద‌ని స్ప‌ష్టం చేయ‌డం, అలాగే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ద్ద‌తుగా ప‌ని చేయాల్సిందే అని చంద్ర‌బాబునాయుడు త‌న పార్టీ నాయ‌కుల‌ను ఆదేశించ‌డంతో అంద‌రూ క‌లిసి ప‌ని చేశారు. జ‌న‌సేన‌ను గెలిపించుకున్నారు.

కానీ త‌మ‌ను క‌లుపుకుని వెళ్ల‌డం లేద‌నే ఆవేద‌న టీడీపీ నాయ‌కుల్లో వుంది. జ‌న‌సేన‌లోనూ అంత‌ర్గ‌త విభేదాలు తీవ్ర‌స్థాయిలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతంపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

11 Replies to “ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోని టీడీపీ!”

  1. హిందువు కాబట్టి ఇలా నీ క్రిస్టియన్ సైట్ లో హిందువుల మీద బురద చల్లుతున్నావు అదే మహా మేత హెలికాప్టర్ లో గుట్ట దాటలేక చచ్చాడు అప్పుడు హిందువులు మాత్రమే స్పందించారు , క్రిస్టియన్ వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు ?

    హిందూవుల మధ్య గొడవలు రేపుతున్న క్రిస్టియన్స్ కలికాలం

  2. మీలాగ డబ్బులు పంచో, బెదిరించో జనాన్ని పోగు చెయ్యాల్సిన ఖర్మ pawan kalyan కి లేదు GA…..PAWAN మీద ఏడవకు….😂😂

  3. Oka padi mandi janasena vallu kuda vuntene, show ani, drama ani, hungama ani rastunanru, ade tdp vallu kuda vaste inka mamuluga vuntara? ayina idi patani personal deeksha, party karyakramam kadu. Telusuko.

Comments are closed.