పోసాని కేసులో సీఐకి హైకోర్టు చీవాట్లు

సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి కేసులో ద‌ర్యాప్తు అధికారికి ఏపీ హైకోర్టు చీవాట్లు పెట్టింది.

సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి కేసులో ద‌ర్యాప్తు అధికారికి ఏపీ హైకోర్టు చీవాట్లు పెట్టింది. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడిపై సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టార‌నే కార‌ణంతో సూళ్లూరుపేట‌లో కేసు న‌మోదైంది. ఈ కేసులో పోసానిని విచార‌ణ నిమిత్తం రావాల‌ని ద‌ర్యాప్తు అధికారి అయిన సీఐ ముర‌ళీకృష్ణ పిలిచారు.

త‌న‌పై సూళ్లూరుపేట‌లో న‌మోదు చేసిన కేసు కొట్టి వేయాల‌ని కోరుతూ పోసాని ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ‌లో భాగంగా ద‌ర్యాప్తు అధికారి అయిన సీఐపై న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌మ ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా ద‌ర్యాప్తు అధికారి వ్య‌వ‌హ‌రించార‌ని కోర్టు మండిప‌డింది. కేసులో అద‌నంగా 111 సెక్ష‌న్‌తో పాటు మ‌హిళ‌ను అస‌భ్యంగా చిత్రీక‌రించార‌ని సెక్ష‌న్లు న‌మోదు చేసిన సీఐపై హైకోర్టు విరుచుకుప‌డింది.

ఈ సెక్ష‌న్లు ఎలా వ‌ర్తిస్తాయ‌ని సీఐని హైకోర్టు ప్ర‌శ్నించింది. ద‌ర్యాప్తు అధికారికి ఫాం-1 నోటీసు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. కేసుపై త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కూ ముందుకెళ్లొద్ద‌ని కోర్టు ఆదేశించింది. రిప్లై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల్ని న్యాయ‌స్థానం ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుండ‌గా పోలీసులు ఎంత గొప్ప‌గా ప‌ని చేస్తున్నారో ఏపీ హైకోర్టు ఆగ్ర‌హ‌మే నిద‌ర్శ‌నం.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే పోలీసుల్ని బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తాన‌ని జ‌గ‌న్ అంటే, అధికార ప‌క్షానికి చెందిన నాయ‌కులు, పోలీస్ సంఘాల నేత‌లు మూకుమ్మ‌డిగా రాజ‌కీయ దాడికి దిగారు. ఇప్పుడు న్యాయ స్థాన‌మే ద‌ర్యాప్తు అధికారిపై మండిప‌డింది. మ‌హిళ‌ల్ని వేధించే సెక్ష‌న్లు ఎలా న‌మోదు చేస్తార‌ని సీఐని నిల‌దీసింది. దీనిపై కూడా జ‌గ‌న్ కామెంట్స్‌పై విమ‌ర్శ‌లు చేసే వాళ్లు స‌మాధానం చెబితే బాగుంటుంది.

9 Replies to “పోసాని కేసులో సీఐకి హైకోర్టు చీవాట్లు”

  1. అవునా ….ఒక CI ని కోర్ట్ మందలించడం తీవ్రమైనది అయితే, గత ప్రభుత్వం లో డీజీపీ నుండి CS దాకా పదులసార్లు స్వయంగా హాజరు అయ్యి, కోర్టు మొట్టికాయలు తిన్నారు. కోర్టు ధిక్కారం కింద గోపాలకృష్ణ ద్వివేది, శ్రీ లక్మి వంటి వారు అపరాధ రుసుము శిక్ష కూడా పడింది. అప్పటి ప్రభుత్వ పని తీరు అది అని అనుకుందామా

    1. avi CBN time lo namodina casulu . oka sari check chesuko thelusthunidi .. prabhthyaniki vyathirekanaga (GO laki ) chana theerupulu vachhaei ..

      adhikarulaki vyathirekanaga ekkuva emi raaledu .

      1. నీ అంత నిషాని కాదులే …ఎవరి టైం లో కేసులో తెలుసు. పిచ్చి సన్నాసి, go కి వ్యతరేకంగా ఇచ్చిన తీర్పు అంటే అమలు చెయ్యాల్సింది ఎవరూ? అమలు చేయకుండా దొబ్బులు తిన్నది ఎందుకో తెలుసుకు ఏడువు

Comments are closed.