జాక్ పాట్ కొట్టిన కొవ్వూరు టీడిపీ మాజీ ఎమ్మెల్యే

రాబోయే ఎన్నికలలో నెల్లూరు జిల్లా రాజకీయం హాట్ టాపిక్ గా మారడానికి వైసిపి వేసిన తప్పుడు ఎత్తుగడలే కారణమని చెప్పుకోవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నెల్లూరు జిల్లా మొత్తం వైయస్…

రాబోయే ఎన్నికలలో నెల్లూరు జిల్లా రాజకీయం హాట్ టాపిక్ గా మారడానికి వైసిపి వేసిన తప్పుడు ఎత్తుగడలే కారణమని చెప్పుకోవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నెల్లూరు జిల్లా మొత్తం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ మంచి మెజారిటీతో పార్లమెంటు స్థానంతో పాటు అసెంబ్లీ సీట్లను అన్ని చేజిక్కించుకోవడంలో కీలకపాత్రను నెల్లూరు జిల్లా పెద్దారెడ్డిలు నడిపిస్తున్నారు.

కానీ రాబోయే 2024 ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందని విశ్లేషకులు ఎనలిస్టులు మరియు సర్వేలు కూడా చెప్పకనే చెబుతున్నాయి. దానికి కారణం నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరడంతో క్యాడర్ చాలా వరకు అతడితో వెళ్లడంతో వైసిపి పార్టీ కాస్త ఇబ్బందులకు గురవుతుంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికే రాజ్యసభ మెంబర్ వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డికి నెల్లూరు పార్లమెంట్ బాధ్యతలను అప్పగించ్చారు.

అసలు నెల్లూరు జిల్లా వైసిపి పార్టీకి ఇలాంటి దుస్థితి రావడానికి ముఖ్య కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు కారణం నెల్లూరు పార్లమెంటుకు ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయమన్న సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటును తన భార్య అయిన ప్రశాంతి రెడ్డికి ఇవ్వాలని కోరడం దానికి సీఎం జగన్ అంగీకరించకుండా నెల్లూరు ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడైన ఖలీల్ కు ఆ సీటును కేటాయించడం రచ్చకు దారితీసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రశాంతి రెడ్డి వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.

కానీ నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ కీలక నేత అయిన నారాయణ విద్యాసంస్థలకు చెందిన నారాయణకు తప్పనిసరిగా ఇవ్వవలసిన పరిస్థితి ఉండడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఆర్థిక వనరుగా ఉండడంతో ప్రశాంతి రెడ్డికి కొవ్వూరు అసెంబ్లీ సీటు ఇస్తామని చెప్పడంతో దానికి వేమిరెడ్డి అంగీకరించడంతో కొవ్వూరు అసెంబ్లీ సీటును కేటాయించడం జరిగింది. ముఖ్యంగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే గత కొన్నేళ్లుగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబానికి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబానికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది.

ఒక ఎన్నికలలో నల్లపరెడ్డి ఆదిపత్యం ప్రదర్శిస్తే మరొక ఎన్నికలలో పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆదిత్యం ప్రదర్శించడం పరిపాటిగా మారింది. కానీ రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అక్కడ నిలబడతాడని అందరూ భావిస్తున్న సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కొవ్వూరు అసెంబ్లీ సీటును కేటాయించడంతో పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయడని వైసిపి ఆ సీటును మంచి మెజారిటీతో కైవసం చేసుకుంటుందని వైసిపి నేతలందరూ భావించారు.

కానీ పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎప్పుడైతే ప్రశాంతి రెడ్డికి సీటు ప్రకటించారో అప్పటినుంచి విధేయుడుగా ఉండటంతో పాటు ఆమె కోసం కొవ్వూరు నియోజకవర్గం మొత్తం చక్కర్లు కొడుతూ ఆమెను గెలిపించడానికి కృషి చేస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ముందుగానే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి దాదాపుగా 20 కోట్ల రూపాయలను ముట్ట చెప్పి అతడిని సైలెంట్ చేసి ఎన్నికల తరువాత తాను గెలిచినా కూడా కొవ్వూరు నియోజకవర్గం మొత్తం పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చేతుల్లోనే ఉండేలాగా ఒప్పందం చేసుకోవడంతో అతడు దాదాపుగా సైలెంట్ అవటమే కాకుండా 20 కోట్ల రూపాయలతో ఎన్నికల ముందే అందుకొని జాక్ పాట్ కొట్టాడని కొవ్వూరు నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

ఇంతా చేసినా కొవ్వూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టిక్కెట్టు దక్కించుకొని కచ్చితంగా గెలిచే అవకాశం ఉందా అని అనుకుంటే అది కూడా ఇప్పుడు డౌట్ గా మారిందని తెలుస్తుంది. దీనికి కారణం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రశాంతి రెడ్డి కోట్ల రూపాయలను ముట్ట చెప్పి పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి దగ్గర టిక్కెట్టు కొనుగోలు చేసిందని, టిడిపి కార్యకర్తలు ఎప్పటి నుంచో పోలంరెడ్డిని నమ్ముకొని రాజకీయం చేస్తుంటే వైసీపీ పార్టీ నుంచి వచ్చి ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలను టిడిపిలో చేర్చుకుని వారికే పెత్తనం ఇవ్వడం పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అనుచరులు జీర్ణించుకోలేక పోతున్నారు.

పోలంరెడ్డి డబ్బులకు అమ్ముడు పోయినా తాము మాత్రం అలాంటి పని చేయమని ఎలాగైనా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బుద్ధి చెబుతామని కొవ్వూరు నియోజకవర్గం టిడిపి కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేయడం చూస్తుంటే రాబోయే రోజులలో కొవ్వూరు అసెంబ్లీ సీటు అనుకున్నంత సులువుగా టిడిపి పార్టీ చేజిక్కించుకునే అవకాశాలు లేవని తెలుస్తుంది.