జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న లీడ‌ర్‌

జ‌గ‌న్ చుట్టూ ఉన్న కొంత మంది నాయ‌కుల్లా కుడి క‌న్ను అధినాయ‌కుడికి గీటి, ఎడ‌మ క‌న్ను లోపాయికారిగా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు మిధున్‌రెడ్డి, ఆయ‌న కుటుంబం గీట‌లేదు.

వైసీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చాలా మంది విడిచి వెళ్లారు. చిన్నాచిత‌కా నాయ‌కులు ఆయ‌న‌కు దూర‌మైతే పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. కానీ విజ‌య‌సాయిరెడ్డి లాంటి అత్యంత స‌న్నిహిత నాయ‌కుడు జ‌గ‌న్‌ను విడిచి వెళ్ల‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్‌ను వీడి వెళ్ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న చుట్టూ ఉన్న కోట‌రీ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌ల‌పై చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. ఎందుకంటే, ఆయ‌న కూడా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ కోట‌రీలో కీల‌కం కాబ‌ట్టి.

కాసేపు విజ‌య‌సాయిరెడ్డి విష‌యాన్ని ప‌క్క‌న పెడ‌దాం. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఎక్కువ టార్గెట్ అయ్యింది పెద్దిరెడ్డి కుటుంబం. చంద్ర‌బాబునాయుడు సీఎంగా బాధ్య‌తలు తీసుకున్న క్ష‌ణం నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని టార్గెట్ చేశారు. మద‌న‌ప‌ల్లె స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఫైల్స్ ద‌గ్గమైతే, దాని వెనుక పెద్దిరెడ్డి ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.

మ‌ద‌న‌ప‌ల్లెలో అస‌లేం జ‌రుగుతున్న‌దో తేల్చాల‌ని, దోషుల్ని వెంట‌నే ప‌ట్టుకోవాలని సీఎం ఆదేశాల‌తో సీఐడీ చీఫ్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు హెలికాప్ట‌ర్‌లో అక్క‌డికి వెళ్లారు. తాజాగా ఆ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి అనుచ‌రుడు మాధ‌వ‌రెడ్డి అనుచ‌రుడిని అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. కానీ మ‌ద‌న‌ప‌ల్లెలో ఫైల్స్ ద‌గ్గం కావడానికి పెద్దిరెడ్డే కార‌ణ‌మ‌న్న ప్ర‌భుత్వ పెద్ద‌లు, కేవ‌లం ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమితం అయ్యారు. ఇంత వ‌ర‌కూ ఆధారాలు లేవు. దానికి సంబంధించి విచార‌ణ న‌త్త న‌డ‌క‌ను త‌ల‌పిస్తోంది.

ఆ త‌ర్వాత లిక్క‌ర్‌, మైనింగ్‌ల‌లో దోపిడీ అంటూ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని టార్గెట్ చేశారు. మిధున్‌ను ఆ కేసులో నిందితుడిగా కూడా చేర్చ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌లే ఆయ‌న సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు కూడా. అలాగే అట‌వీ భూముల్ని భారీగా ఆక్ర‌మించారంటూ ప్ర‌భుత్వ అనుకూల మీడియాలో క‌థ‌నాలు రావ‌డం, వెంట‌నే విచార‌ణ‌కు సంబంధిత‌శాఖ మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆదేశాలు ఇవ్వ‌డాన్ని అంద‌రూ చూశారు. అయితే అలాంటిదేమీ లేద‌ని సంబంధిత ఉన్న‌తాధికారులు తేల్చ‌డంతో, కుమ్మ‌క్క‌య్యార‌ని ప్ర‌భుత్వ యంత్రాంగాన్నే ఆ మీడియా హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

పెద్దిరెడ్డి కుటుంబాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు తెర‌పైకి వ‌చ్చాయి. కేసుల నుంచి త‌ప్పించుకోడానికి, ముఖ్యంగా మిథున్‌రెడ్డి భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీలో వాళ్లంతా చేరిపోతార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌మ్ముడు ద్వార‌క‌నాథ‌రెడ్డి ఎమ్మెల్యేలుగా, మిధున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా గెలుపొంది, ప్ర‌జ‌ల్లో త‌మ కుటుంబానికి ఆద‌ర‌ణ ఏపాటిదో నిరూపించుకున్నారు.

స‌హ‌జంగానే ఇది పార్టీలోనే జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న కొంద‌రికి కంట‌గింపుగా త‌యారైంది. జ‌గ‌న్ ద‌యాదాక్షిణ్యాల‌పై వాళ్ల రాజ‌కీయ మ‌నుగ‌డ లేదు. వైసీపీ, జ‌గ‌న్ పేరు చెప్పుకుని రాజ‌కీయంగా వాళ్లు బ‌తికే ప‌రిస్థితి ఎంత మాత్రం లేదు. అందుకే ఆత్మాభిమానంతో రాజ‌కీయం చేస్తుంటారు. జ‌గ‌న్ ద‌గ్గ‌రికెళ్లి చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డే ర‌కం కాదు. త‌మ‌కు ఆత్మాభిమానం వుండ‌డం వ‌ల్లే, నాయ‌కుడి గౌర‌వాన్ని కాపాడాల‌ని వారు కోరుకుంటుంటారు.

కానీ ఆత్మాభిమానం లేని కొంత మంది జ‌గ‌న్ చుట్టూ చేరి, పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా వైసీపీకి దూరం చేయాల‌ని కుట్ర‌ల‌కు తెర‌లేపారంటే, ఆ పార్టీలో ఎలాంటి వాళ్లు ఉన్నారో అంచ‌నా వేయొచ్చు. అయిన‌ప్ప‌టికీ మిధున్‌రెడ్డిపై జ‌గ‌న్ ప్ర‌త్యేక అభిమానాన్ని చాటుకుంటుంటారు. మిధున్ కూడా అధినాయ‌కుడి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నారు. ఆరోప‌ణ‌లు, కేసులు వ‌చ్చి మీద‌ప‌డుతున్నా, ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా మ‌రింత నిటారుగా నిల‌బ‌డ్డారు. త‌మ‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న మీడియా అధినేత‌ల‌కు బ‌హిరంగంగా ఆయ‌న హెచ్చ‌రిక చేశారు.

జ‌గ‌న్ చుట్టూ ఉన్న కొంత మంది నాయ‌కుల్లా కుడి క‌న్ను అధినాయ‌కుడికి గీటి, ఎడ‌మ క‌న్ను లోపాయికారిగా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు మిధున్‌రెడ్డి, ఆయ‌న కుటుంబం గీట‌లేదు. అందుకే జ‌గ‌న్ కంటే ఎక్కువ ఆరోప‌ణ‌లు, కేసులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జ‌గ‌న్‌తోనే త‌మ రాజ‌కీయ ప‌య‌నం అని మాట‌ల ద్వారా కాదు, చేత‌ల్లో నిరూపించిన ఘ‌న‌త మిధున్‌రెడ్డి కుటుంబానికి ద‌క్కింది. జ‌గ‌న్ న‌మ్మకాన్ని నిల‌బెట్టిన వైసీపీ ముఖ్య నాయ‌కుల్లో మొద‌టి పేరు మిధున్‌దే. జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసిన నాయ‌కుల్లో కొంద‌రు పార్టీని విడిచిపెట్టి వెళ్ల‌గా, మ‌రికొంద‌రు గ‌బ్బిలాల మాదిరిగా అంటిపెట్టుకుని న‌ష్టం చేస్తున్నారనే అభిప్రాయం లేక‌పోలేదు.

13 Replies to “జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న లీడ‌ర్‌”

  1. ///కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఎక్కువ టార్గెట్ అయ్యింది పెద్దిరెడ్డి కుటుంబం.///

    .

    అదికారం లొ ఉండగా ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబం ఎలా పెట్రెగిపొయింది జనం చూడలెదా? అంగల్ల కెసు నుండి, ఎవరొ అబిమానులు సైకిల్ యాత్ర చెస్తె చొక్కలు విప్పించింది వరకూ ఎలా మరిచిపొయారు! అసలు పుంగనూరులొ వీళ్ళు ఎన్ని అరాచకాలు చెసారు?

    ఇప్పుడు ఆ అరాచకాలె శాపాలు అయ్యి, వాళ్ళ మెడకు చుట్టు కుంటున్నాయి. ఈ పెద్ది రెడ్డి కుటుంబం కూడా BJP ప్రాపకం కొసం చూస్తుంది అని బొగొట్టా? అయితె అక్కడ నుండి ఇంకా ఎ వార్త రాకనె ఈ ఎదురుచూపు అని టాక్!

  2. పెద్దిరెడ్డి పార్టి మారితె పెద్దిరెడ్డి గురించి చాలా చండాలంగా కదలు రావటానికి బులుగు మీడియాకు ఎక్కువ సమయం పట్టదు!

    అయినా తల్లి, చెల్లి నె వదలకుండా రాసిన బులుగు మీడియా.. పెద్ది రెడ్డి కుటుంబాన్ని వదులుతుందా?

  3. ఎన్ని అరాచకాలు చేసినా, అభ్యర్థులను ప్రచారం చేసుకోకుండా గుండాల్లా దౌర్జన్యం చేసి రిగ్గింగ్ చేసుకున్నా.. 

    పాపాల్ పెద్ది కి ఒక సర్పంచ్ కి వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు

    మైధానం గాడు ఎంపీ గా MLA మెజారిటీ కంటే తక్కువ మెజారిటీ తో బైట పడ్డాడు ఎదవ.

    ఈ నాయాళ్ళు ఈ టర్మ్ లో survive కావడం చాలా కష్టం 

  4. చంద్రబాబు NOC ఇస్తే వీడు, వీడి అయ్యతో కలిసి బీజేపీ లోకి ఎప్పుడో జంప్ అయ్యేవాడు .

Comments are closed.