వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు కనిపించడం లేదు. తాడేపల్లి కోటరీతో అంటకాగే, జనంతో ఏ మాత్రం సంబంధం లేని నాయకులకు జగన్ అపాయింట్‌మెంట్స్ ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేసే వ్యక్తులకు నేరుగా జగన్ దర్శన భాగ్యం కలుగుతోందన్న విమర్శ వైసీపీలోనే వుంది.
జగన్‌తో కలిపించే నాయకులెరికైనా పది ఓట్లు ఉన్నాయా? అంటే… అదేం లేదు. తమతో బాగుంటారనే ఏకైక కారణంతో జగన్‌ను కలవాలని కోరినప్పుడల్లా వీళ్లు తీసుకెళుతున్నట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నాయకులే కాని మహిళలను జగన్ దగ్గరకు తీసుకెళ్లడంలో ఉత్సాహం చూపుతున్నారనే బలమైన ఆరోపణలున్నాయి. ఇలా చేయడం ద్వారా వైసీపీకి నిజమైన కార్యకర్తలు, నాయకుల్ని దూరం చేయడమే అనే వాదన లేకపోలేదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కోటరీ నాయకులను ప్రసన్నం చేసుకుని కీలకమైన నామినేటెడ్ పదవుల్ని దక్కించుకున్నోళ్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ, జగన్, అలాగే కోటరీ నాయకుల వద్దకు వచ్చేందుకు తీరిక లేని నాయకులు భారీగా నష్టపోయారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకు గుర్తింపు వుంటుందనే భ్రమతో పని చేసిన వాళ్లు, చివరికి ఆర్థికంగా నష్టపోవడం తప్ప, అధికారంలో సాధించేదేమీ లేదు.
ప్రజలతో సంబంధం లేకుండా, కోటరీ నాయకుల ఆశీస్సులతో కీలక పదవులు దక్కించుకున్న వాళ్లలో స్త్రీ, పురుషులు అనే తేడా లేదు. కోటరీలోని కొందరి బలహీనతలు పసిగట్టిన నాయకులు సులువుగా పదవులు దక్కించుకోగలిగారు. ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగే ప్రమాదం వుందనే ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది. కోటరీ చుట్టూ తప్ప, ఈ నెల 13, అలాగే 27న తలపెట్టిన రైతు, విద్యుత్ పోరు ఉద్యమాల్లో నామినేటెడ్ పదవులు పొందిన వాళ్లలో ఎంత మంది పాల్గొన్నారో లెక్కలు తీయాలి.
అప్పుడు గానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటో, నిజంగా పార్టీ కోసం పని చేసిన, చేస్తున్న నాయకులెవరో తేలిపోతుంది. సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడే వారిని నాయకులుగా గుర్తిస్తే, ఎప్పటికీ వైసీపీకి భవిష్యత్ వుండదు. ఇప్పటికైనా కోటరీ నాయకులు తమ బలహీనతల కోసం వైసీపీని, జగన్‌ను శాశ్వతంగా ముంచకుండా, వైసీపీ హయాంలో లబ్ధి పొందిన పుణ్యానికి మంచి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అనే వేమన పద్యం ఎప్పుడు ఐన విన్నారా ???
No use in supporting Jagan, GA.
So, you please change.
Stop supporting Jagan blindly.
Now, NDA govt is going in right direction. They will also implement Super Six completely one by one .So dont worry
స్వానుభవం తో చెబుతున్నాను ఇది ముమ్మాటికి నిజం