ప్రజలతో మమేకం కావడం ఇలా కాదు జగన్!

నిరంతరం తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటూ, అరెస్టు అయిన వారిని, మరణించిన వారిని పరామర్శించడానికి మాత్రం వెళుతూ.. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినంత కాలం.. పార్టీ స్ఫూర్తి ప్రజల్లోకి వెళుతుందా అనేది సందేహం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చాలా ఘనంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. ప్రతిపక్షం తమకు కొత్త కాదంటూ.. నేతల్లో స్ఫూర్తి నింపడానికి ప్రయత్నించారు.

తమ పార్టీ ప్రస్తుతం సాగిస్తున్న ప్రజాపోరాటాలకు లభిస్తున్న స్పందన పట్లకూడా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా ఉంటుందని జగన్ ప్రకటించారు. ఆ మాట చాలా బాగుంది. కానీ, నిరంతరం ప్రజలతోనే ఉంటాననే జగన్ మాటలను ప్రజలు నమ్మేలా చేసుకోవడం ఇలా కాదు.. అని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

నిరంతరం ప్రజలతో ఉంటానని జగన్ అనడం ఇది తొలిసారి కాదు. అలా ప్రజలతో మమేకమై ఉండడం అంటే.. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడూ నిరసనలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించడం మాత్రమే కాదు.. అనే సంగతి జగన్ అర్థం చేసుకోవడం లేదు. పార్టీ ప్రజలతో ఉండడం అంటే.. ఈ పోరాటాలు ప్రకటిస్తే చాలు.. అని జగన్ అనుకుంటున్నట్టుగా ఉంది. కానీ.. ఆయన స్వయంగా పోరాటాలను ముందుండి నడిపించాలి. ఆ బాధ్యతను ఆయన గుర్తించడం లేదు.

నిజానికి జగన్ పార్టీని పునరుత్తేజితం చేయడానికి ఈ సంక్రాంతి నుంచి జిల్లా పర్యటనలకు వెళ్లేలా గతంలో ప్రకటించారు. ప్రతి వారంలో రెండు రోజులు ఒక జిల్లాలో ఉంటానని ఆయన ప్రకటించారు. ఒకరోజు జిల్లా కార్యకర్తలతో సమావేశం అవుతానని, ఒకరోజు బహిరంగ సభ ఉంటుందని ప్రణాళిక కూడా ప్రకటించారు. లండన్ వెళ్లడం, కొన్ని అనివార్య కారణాల వల్ల అంతా అనుకున్నట్టుగా జరగలేదు. లండన్ నుంచి తిరిగొచ్చి కూడా చాలా కాలం అయింది. ఇప్పటిదాకా ఆయన పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి సంకల్పించిన జిల్లా యాత్రలు మొదలు కాలేదు.

నిరంతరం తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటూ, అరెస్టు అయిన వారిని, మరణించిన వారిని పరామర్శించడానికి మాత్రం వెళుతూ.. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినంత కాలం.. పార్టీ స్ఫూర్తి ప్రజల్లోకి వెళుతుందా అనేది సందేహం. పార్టీ నిజంగా గాడిలోపడాలంటే.. ఆయన తాను స్వయంగా పూనుకోవాలని ఆయన గుర్తించడం లేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది వ్యక్తిస్వామ్య పార్టీ అని ముందు ఆయన గ్రహించాలి. పార్టీ మరియు జగన్ వేర్వేరు కాదు. జగన్మోహన్ రెడ్డే ఆ పార్టీ. కనుక, పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండడం అని జగన్ ప్రకటిస్తే.. జగన్మోహన్ రెడ్డి స్వయంగా నిరంతరం ప్రజల్లో ఉంటేనే అది సాధ్యమైనట్టు లెక్క! ఆ విషయాన్ని జగన్ గుర్తించి మసలుకోవాలి. జిల్లా యాత్రల రూపేణా జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలు చేయకుండా.. పార్టీని పునరుజ్జీవింపజేయడం అంత సులువుకాదని .. పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.

10 Replies to “ప్రజలతో మమేకం కావడం ఇలా కాదు జగన్!”

  1. జిల్లా యాత్రలు, పోరాటాలు, ధర్నాలు చేస్తే EVM లు ఓట్లు వేస్తాయా??

    చెప్పా కదా మనం కేవలం

    అతి మంచితనంతో, అతి నిజాయితీగా ఇంకో 5 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుంటే చాలు అధికారం తాడేపల్లి గేటు తన్నుకుంటూ అదే మన ప్యాలెస్ కి వస్తది.. నువ్వు అనవసరం గా టెన్షన్ పడి, నన్ను ప్యాలెస్ కి దూరం చేసి, అది వాడితో పెర్మనంట్ గా కులుకే విధంగా plan చేస్తున్నావేమో…. నేను మోనార్క్ ని, నన్ను నా “బ్రా రతీ₹ మాత్రమే మోసం చేయగలదు..

    ఇట్లు

    ప్యాలెస్ పులకేసి

  2. జిల్లా యాత్రలు, పోరాటాలు, ధర్నాలు చేస్తే ‘EVM లు ఓట్లు వేస్తాయా??

    చెప్పా కదా మనం కేవలం

    అతి మంచితనంతో, అతి నిజాయితీగా ఇంకో 5 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుంటే చాలు అధికారం తాడేపల్లి గేటు తన్నుకుంటూ అదే మన ప్యాలెస్ కి వస్తది.. నువ్వు అనవసరం గా టెన్షన్ పడి, నన్ను ప్యాలెస్ కి దూరం చేసి, అది వాడితో పెర్మనంట్ గా కులుకే విధంగా plan చేస్తున్నావేమో…. నేను మోనార్క్ ని, నన్ను నా “బ్రా రతీ₹ మాత్రమే మోసం చేయగలదు..

    ఇట్లు

    ప్యాలెస్ పులకేసి

  3. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మాయ చేసి గెలిచారు అన్నప్పుడు

    వాళ్ళు అధికారం లో ఉన్నప్పుడు మీరు ఎలా గెలుస్తారు..

  4. తొందరెందుకు బ్రో? నాలుగేళ్ళు పోయాక పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర మొదలెడతారు.

  5. ఎండలు ముదిరాయి…. ఇప్పుడు కష్టం…కొంచం చల్లబడ్డాక చూద్దాం

Comments are closed.